AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: లెస్బియన్స్ ప్రేమ.. అబ్బాయిగా మారుస్తామంటూ ప్రామిస్.. కట్ చేస్తే కళ్లుముందే ఘోరం..

ప్రియ(30), ప్రీతి (24).. వీళ్లిద్దరూ లెస్బియన్స్.. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. విషయం బయటకు తెలియకుండా రహస్యంగానే కథ నడిపారు. కానీ, ఏదోలా మ్యాటర్ మొత్తం లీక్ అయ్యింది. ఇక వారిని పెళ్లి చేసుకోవడానికి ఏ అబ్బాయి ముందుకు రాలేదు. పైగా స్థానికంగా సూటిపోటి మాటలు. ఇంకేముంది.. వీరి కారణంగా ఇంట్లోవారికి పరువు పోయినట్లుగా భావించారు.

Uttar Pradesh: లెస్బియన్స్ ప్రేమ.. అబ్బాయిగా మారుస్తామంటూ ప్రామిస్.. కట్ చేస్తే కళ్లుముందే ఘోరం..
Lesbian Love
Shiva Prajapati
|

Updated on: Jun 21, 2023 | 2:09 PM

Share

ప్రియ(30), ప్రీతి (24).. వీళ్లిద్దరూ లెస్బియన్స్.. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. విషయం బయటకు తెలియకుండా రహస్యంగానే కథ నడిపారు. కానీ, ఏదోలా మ్యాటర్ మొత్తం లీక్ అయ్యింది. ఇక వారిని పెళ్లి చేసుకోవడానికి ఏ అబ్బాయి ముందుకు రాలేదు. పైగా స్థానికంగా సూటిపోటి మాటలు. ఇంకేముంది.. వీరి కారణంగా ఇంట్లోవారికి పరువు పోయినట్లుగా భావించారు. మరోవైపు.. ప్రీతికి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ, ప్రియ అందుకు అందుకు అంగీకరించలేదు. తనతోనే కలిసి ఉండాలని పట్టుబట్టింది. అవసరమైతే తానే అబ్బాయిగా మారుతానంటూ మొండికేసింది. ఈ మ్యాటర్‌ అంతా ప్రీతి తన ఇంట్లో చెప్పింది. అయితే, అబ్బాయిగా మారుతానంటూ ప్రియ చెప్పిన మాటలను ప్రీతి, ఆమె తల్లి అవకాశంగా మార్చుకున్నారు. ప్రియను వదిలించుకునేందుకు స్కెచ్ వేశారు. చివరకు అనుకున్నంత పని చేశారు. లింగ మార్పిడి పేరుతో అత్యంత కిరాతకంగా చంపించేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఆర్‌సి మిషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ప్రియ(30), ప్రీతి (24) ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ స్నేహం కాస్తా స్వలింగ సంపర్కానికి దారితీసింది. ప్రియ.. ప్రీతిపై ప్రేమను పెంచుకుంది. మరోవైపు ప్రీతి.. ప్రియను వదిలించుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తల్లితో కలిసి పథకం వేసింది. మహ్మదీ ప్రాంతానికి చెందిన ఓ మంత్రగాడితో కలిసి పథకం వేశారు. ప్రియను చంపేందుకు రూ. 1.5 లక్షలు సాపారీ కూడా మాట్లాడుకున్నారు. ఇంకేముంది.. ప్రియ కోరిక మేరకు లింగ మార్పిడి చేస్తామంటూ రప్పించారు. ఓ కొలను ఒడ్డున నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ పూజలు చేస్తున్నట్లుగా నమ్మించి, కళ్లు మూసుకుని పడుకోమని చెప్పారు. అది నమ్మిన ప్రియ.. కళ్లు మూసుకుని నేలపై పడుకుంది. ఇంకేముంది.. కత్తి తీసుకుని ఆమెను దారుణంగా పొడిచి పొడిచి చంపేశారు.

అయితే, ఏప్రిల్ 13న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రియ మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. మూడు రోజుల పాటు తీవ్రంగా గాలించినా ఆచూకి లభించలేదు. దాంతో ప్రియ కుటుంబ సభ్యులు ఏప్రిల్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఆమె ఫోన్ కాల్స్, ఇతర టెక్నికల్ ఆధారాలను బేస్ చేసుకుని ప్రియ హత్యకు గురైనట్లు కనిపెట్టారు. లింగ మార్పిడి పేరుతో ప్రియను రప్పించి హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి