Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ట్రైన్‌లో ఇచ్చే బెడ్‌షీట్ ఇంటికి తెచ్చుకోవచ్చా? తప్పక తెలుసుకోవాల్సిన రైల్వే రూల్స్..

ట్రైన్‌లో ఏసీ కోచ్‌లో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే సిబ్బంది ఒక బెడ్ షీట్, టవల్, దుప్పటి వంటివి ఇస్తారు. ప్రయాణ సమయంలో వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే, మీ గమ్యస్థానం చేరిన తరువాత వాటిని రైల్‌లోనే వదిలేయాల్సి ఉంటుంది.

Indian Railways: ట్రైన్‌లో ఇచ్చే బెడ్‌షీట్ ఇంటికి తెచ్చుకోవచ్చా? తప్పక తెలుసుకోవాల్సిన రైల్వే రూల్స్..
Train Towel Bedding
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 20, 2023 | 2:07 PM

ట్రైన్‌లో ఏసీ కోచ్‌లో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే సిబ్బంది ఒక బెడ్ షీట్, టవల్, దుప్పటి వంటివి ఇస్తారు. ప్రయాణ సమయంలో వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే, మీ గమ్యస్థానం చేరిన తరువాత వాటిని రైల్‌లోనే వదిలేయాల్సి ఉంటుంది. అయితే, ప్రయాణం తరువాత పొరపాటున కూడా వాటిని తీసుకెళ్లకూడదు. చాలా మంది ఈ బెడ్‌షీట్‌లను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ, అది రైల్వే చట్టాల ప్రకారం నేరం.

రైలు దిగాక.. ట్రైన్‌కు సంబంధించిన వస్తువులు ఏవైనా మీవద్ద కనిపిస్తే రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఎవరి వద్దనైనా బెడ్‌రోల్ మెటీరియల్ కనిపిస్తే.. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? జైలు శిక్ష విధిస్తారా? రైల్వే శాఖలో ఏ నిబంధనలు ఉన్నాయి? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఏసీ కోచ్‌లో ప్రయాణించే ప్రయాణికులకు బెడ్‌రోల్ ఇస్తారు. రైల్వే అందించే బెడ్‌రోల్‌లో రెండు షీట్లు, ఒక దుప్పటి, ఒక దిండు, ఒక దిండు కవర్, టవల్ ఉంటుంది. అయితే, కరోనా సమయంలో బెడ్ రోల్స్ ఇవ్వడంపై నిషేధం విధించింది. ఇప్పుడు పరిస్థితి అదుపులోకి రావడంతో.. మళ్లీ బెడ్‌ రోల్స్ ఇస్తున్నారు. అయితే, ఇప్పుడు టవల్స్ మాత్రం చాలా అరుదుగా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అరెస్ట్ చేశారు..

ఇదిలాఉంటే.. కరోనాకు ముందు.. అంటే 2017 18లో 1.95 లక్షల టవల్స్, 81,776 బెడ్ షీట్లు, 5,038 పిల్లో కవర్లు, 7,043 బ్లాంకెట్లు చోరీకి గురయ్యాయి. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో బెడ్ రోల్స్, ఇతర వస్తువులు చోరీకి గురవుతున్నాయి. ఈ వస్తువు విలువ దాదాపు రూ.14 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణం ముగిసే అరగంట ముందు బెడ్‌రోల్ వస్తువులను ప్రజలు దొంగిలించకుండా సేకరించాలని రైల్వే అటెండర్‌లకు సూచించారు అధికారులు. అంతేకాదు.. వీటిని తీసుకెళ్తూ దొరికిపోయిన చాలా మంది ప్రయాణికులను అరెస్ట్ కూడా చేశారు.

బెడ్ రోల్ ఇంటికి తీసుకెళ్తే ఏమవుతుంది..

కొందరు ప్రయాణికులు రైల్వే శాఖ ఇచ్చిన బెడ్‌ రోల్‌ను తీసుకెళ్తుంటారు. ఇలా ఎవరైనా తీసుకెళ్తూ పట్టుబడితే.. వారిపై రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటారు. దీనిని రైల్వే ఆస్తిగా పరిగణించి, రైల్వే ఆస్తి చట్టం 1966 ప్రకారం శిక్ష విధిస్తారు. ఈ నేరానికి ఒక సంవత్సరం శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తారు. ఇక గరిష్ఠ శిక్ష విషయానికి వస్తే.. 5 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..