కట్నం సరిపోలేదని పెళ్లే వద్దన్న వరుడు.. ఇంటిల్లిపాదికి గుణపాఠం చెప్పిన వధువు..

పెళ్లిలో కట్నం అడగడం, ఇవ్వడం నేరమని ఎన్నో నిబంధనలు, చట్టాలు ఉన్నప్పటికీ ఈ దారుణం ఇంకా కొనసాగుతూనే ఉంది. వరకట్న వేధింపులు ప్రస్తుత కాలంలో లేవని అనిపించినా, అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్న కొన్ని సంఘటనలు మనసుల్ని కలిచివేస్తున్నాయి. తాజాగా, కట్నం డిమాండ్ చేసిన వరుడికి ఏం జరిగిందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

కట్నం సరిపోలేదని పెళ్లే వద్దన్న వరుడు.. ఇంటిల్లిపాదికి గుణపాఠం చెప్పిన వధువు..
Wedding
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 20, 2023 | 8:26 PM

పెళ్లి అనేది వధూవరులు మాత్రమే కాకుండా రెండు కుటుంబాలు కలిసి జరుపుకునే అద్భుత ఘట్టం. వివాహానికి సంబంధించి వివిధ ప్రాంతాలలో రకరకాల ఆచారాలు పాటిస్తారు. సోషల్ మీడియాకు ప్రజల్లో ఆదరణ వచ్చిన తర్వాత చాలా చోట్ల ఆచరించే చిత్ర విచిత్ర ఆచారాలు, పెళ్లిళ్లలో జరిగే వింతలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇక సోషల్ మీడియా ప్రపంచమే ఆశ్చర్యాలతో నిండిపోయి కనిపించేది.. మనం ఇంటర్నెట్‌లో చూసే వీడియోలలో ఒక్కోసారి నవ్విస్తాయి., ఒక్కోసారి ఆలోచింపజేస్తాయి., ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఒక్కోసారి దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. ఇలా ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇక వెడ్డింగ్ వీడియోలకు కూడా ఇంటర్నెట్‌లో విపరీతమైన అభిమానులు ఉన్నారు.

మన దేశంలో పెళ్లిని చాలా పవిత్రంగా భావిస్తారు. కానీ పెళ్లితో ముడిపడి ఉన్న కొన్ని ఆచారాలు మాత్రం కొన్ని కొన్ని సందర్భాల్లో భయనకంగా కూడా కనిపిస్తాయి. వరకట్నం కూడా అటువంటి క్రూరమైన ఆచారమే అని చెప్పాలి. వరకట్నం తీసుకోవడం, ఇవ్వడాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలను రూపొందించింది. వరకట్నం ఇచ్చేవారు కట్నం తీసుకునేవారిపై చర్యలు తీసుకోవాలని నిబంధన పెట్టారు. అయినా వరకట్నం కేసుల సంఖ్య మాత్రం తగ్గలేదు. పెళ్లిలో కట్నం అడగడం, ఇవ్వడం నేరమని ఎన్నో నిబంధనలు, చట్టాలు ఉన్నప్పటికీ ఈ దారుణం ఇంకా కొనసాగుతూనే ఉంది. వరకట్న వేధింపులు ప్రస్తుత కాలంలో లేవని అనిపించినా, అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్న కొన్ని సంఘటనలు మనసుల్ని కలిచివేస్తున్నాయి. తాజాగా, కట్నం డిమాండ్ చేసిన వరుడికి ఏం జరిగిందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. అతడి పరిస్థితికి సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో ఆధారంగా వివాహా మూహూర్తం మరికాసేపట్లో ఉంది. చుట్టాలు, బంధువులు అంతా మండపానికి చేరుకున్నారు. వెడ్డింగ్‌ సూట్‌లో వరుడు కూడా పెళ్లి మండపానికి చేరుకున్నాడు. కానీ, అంతలోనే..వరుడి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేసింది. అందుకు తగిన శిక్ష కూడా అనుభవించారు వరుడి కుటుంబీకులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పెళ్లి దుస్తుల్లో ఉన్న పెళ్లి కొడుకును ఒక చెట్టుకు కట్టేసి ఉండటం మనం వీడియోలో చూడొచ్చు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

ఇవి కూడా చదవండి

Dowry Demand

ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగినట్టుగా తెలిసింది. వివాహ వేడుకలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన వరుడి కుటుంబ సభ్యులు, మందడ ప్రాంతంలోని హరక్‌పూర్‌కు చెందిన వధువు ఇంటికి వచ్చింది. ఇంతలో అకస్మాత్తుగా వరుడి కుటుంబీకులు వధువు పుట్టింటి వారిని కట్నం అడగడం ప్రారంభించారు. ఎక్కువ కట్నం ఇవ్వాలని, లేని పక్షంలో పెళ్లి చేసేది లేదని తేల్చిచెప్పారు. దాంతో వధువు, ఆమె తల్లిదండ్రులు, బంధువులు షాక్‌కు గురయ్యారు. వారికి నచ్చజెప్పి, శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ, వరుడి కుటుంబీకులు పట్టుబట్టడంతో ఆగ్రహించిన కుటుంబీకులు పెళ్లి కొడుకును, అతని కుటుంబాన్ని చెట్టుకు కట్టేశారు. వరకట్నం డిమాండ్ చేసినందుకు వారిని ఇలా శిక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద రోజంతా గందరగోళం నడిచినప్పటికీ ఈ పెళ్లి తంతు పూర్తి కాలేదని తెలిసింది. కానీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను @asiamanchnews సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..