భూమిపై 84 కిలోల బరువున్న మనిషి చంద్రుడిపై ఎంత ఉంటాడో తెలుసా..?
1969 జులై 20న చంద్రునిపై మానవుడు తొలిసారిగా అడుగు పెట్టిన రోజు. అతని అనుభవం ఎలా ఉందో తెలుసా? ఒక వ్యక్తి చంద్రునిపైకి వెళితే అతని బరువులో మార్పు వస్తుంది. ఇది నిజం. చంద్రునిపైకి చేరుకున్న తర్వాత, బరువు ఎవరూ ఊహించనంత తక్కువగా ఉంటుంది. చంద్రునిపైకి వెళ్లిన తర్వాత మనిషి బరువులో ఎలాంటి మార్పులు వస్తాయో..
బాహ్య అంతరిక్ష ప్రపంచం అంతులేనిది. దీని రహస్యాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు నిరంతరంగా శ్రమిస్తున్నారు. భూమికి దగ్గరగా ఉన్న చంద్రుడి రహస్యాలు కూడా మెల్లగా తెరపైకి వస్తున్నాయి. 1969 జులై 20న చంద్రునిపై మానవుడు తొలిసారిగా అడుగు పెట్టిన రోజు. అతని అనుభవం ఎలా ఉందో తెలుసా? ఒక వ్యక్తి చంద్రునిపైకి వెళితే అతని బరువులో మార్పు వస్తుంది. ఇది నిజం. చంద్రునిపైకి చేరుకున్న తర్వాత, బరువు ఎవరూ ఊహించనంత తక్కువగా ఉంటుంది. చంద్రునిపైకి వెళ్లిన తర్వాత మనిషి బరువులో ఎలాంటి మార్పులు వస్తాయో, ఎంత తగ్గుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
చంద్రుడిపైకి చేరుకున్న తర్వాత మనిషి బరువు చాలా తగ్గుతున్నారు. మీరు భూమిపై ఎంత బరువున్నారో అది చంద్రునిపై మీ బరువులో 1/6వ వంతు అవుతుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి భూమిపై 84 కిలోల బరువు ఉంటే, చంద్రునిపైకి వెళ్ళిన తర్వాత అతని బరువు 14 కిలోలు మాత్రమే ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..
ఇది పూర్తిగా గురుత్వాకర్షణ వల్ల కలుగుతుంది. చంద్రుని గురుత్వాకర్షణ త్వరణం భూమి విలువలో 1/6గా ఉంటుంది. ఈ కారణంగా మనిషి బరువు భూమి బరువులో 1/6వ వంతు ఉంటుంది. చంద్రుడిని చేరుకున్న తర్వాత వ్యోమగాములు 6 రెట్లు తక్కువ బరువును అనుభవిస్తారు. నిజానికి ద్రవ్యరాశి, బరువు రెండు వేర్వేరు విషయాలు. బరువు అనేది శక్తి ఒక రూపం. చంద్రుడిని చేరుకున్న తర్వాత ద్రవ్యరాశి అలాగే ఉంటుంది. కానీ మీరు తక్కువ బరువు అనుభూతి చెందుతారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..