రహదారి రక్తసిక్తం..! డివైడర్‌ని ఢీకొట్టి రాంగ్‌ రూట్‌లోకి ప్రవేశించిన కారు.. అక్కడికక్కడే ముగ్గురు మృతి..

వర్షం కురుస్తున్న కారణంగా రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో బెంగుళూరు వైపు వెళుతున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్ మీదుగా వెళ్ళి రాంగ్ రూట్‌లోకి ప్రవేశించినట్లుగా తెలిసింది. మృతులంతా స్విఫ్ట్ కారులో కూర్చొని ఉండగా, టాటా నెక్సాన్‌లో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

రహదారి రక్తసిక్తం..! డివైడర్‌ని ఢీకొట్టి రాంగ్‌ రూట్‌లోకి ప్రవేశించిన కారు.. అక్కడికక్కడే ముగ్గురు మృతి..
Car Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 20, 2023 | 6:02 PM

బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే మద్దూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూన్‌ 20 మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బెంగళూరు వైపు వెళ్తున్న టాటా నెక్సాన్ కారు డివైడర్‌ను ఢీకొట్టి మైసూరు వైపు వెళ్తున్న క్యాబ్ (మారుతి సుజుకీ స్విఫ్ట్)ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వర్షం కురుస్తున్న కారణంగా రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో బెంగుళూరు వైపు వెళుతున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్ మీదుగా వెళ్ళి రాంగ్ రూట్‌లోకి ప్రవేశించినట్లుగా తెలిసింది. మృతులంతా స్విఫ్ట్ కారులో కూర్చొని ఉండగా, టాటా నెక్సాన్‌లో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటినా మంగళూరులోని విమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీరజ్ కుమార్ (50), అతని భార్య సెల్వి (47), మాండ్యకు చెందిన కారు డ్రైవర్ నిరంజన్ (35) మృతి చెందారు. నీరజ్ కుమార్ తన భార్య సెల్వితో కలసి బెంగళూరు నుంచి స్విఫ్ట్ డిజైర్ కారులో మైసూర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. బెంగళూరు వెళ్తున్న టాటా నెక్సాన్ అనే మరో కారు డివైడర్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత ఈ కారును ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నెక్సాన్‌ కారులో ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం మాండ్యా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చేర్పించారు.

కాగా, బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై గత ఐదు నెలల్లో 550కి పైగా ప్రమాదాలు జరగ్గా, దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..