అంత్యక్రియలకు తీసుకెళ్తుంటే శవపేటికలోంచి శబ్ధాలు.. తెరిచి చూస్తే లేచి కూర్చున్న వృద్ధురాలు..
దాదాపు 5 గంటల పాటు శవపేటికలోనే ఉన్న ఓ వృద్ధురాలు శవపేటికను తట్టి బంధువులకు షాక్ ఇచ్చింది. స్పృహలోకి వచ్చిన బెల్లా..శవపేటికను కాళ్లు, చేతులతో కొట్టడం ప్రారంభించింది. శవపేటిక నుండి వచ్చే శబ్దాలు విన్న బంధువులు షాక్ అయ్యారు. ఆమె బతికే ఉందని గ్రహించి.. నేరుగా ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి అత్యవసర చికిత్స అందించారు..
చనిపోయిందని నిర్ధారించిన ఒక వృద్ధురాలు..అంత్యక్రియల సమయంలో లేచింది. దాంతో ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఒకింత షాక్‌కు గురయ్యారు. అంత్యక్రియల సందర్భంగా వృద్ధురాలి మృతదేహాన్ని ఉంచిన శవపేటికలోంచి శబ్ధాలు రావటంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆమె బ్రతికే ఉందని తెలిసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి ఆమెకు చికిత్స అందజేశారు. కానీ, పాపం వారం రోజుల తర్వాత స్ట్రోక్ కారణంగా ఆ వృద్ధురాలు శాశ్వతంగా కన్నుమూశారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర అమెరికాలోని ఈక్వేడార్‌లో చోటు చేసుకుంది.
అమెరికాకు చెందిన రిటైర్డ్ నర్సు బెల్లా మోంటోయా స్ట్రోక్ కారణంగా మరణించినట్లు ప్రకటించారు వైద్యులు. జూన్ 9న బెల్లా చనిపోయినట్లు ప్రకటించారు. తర్వాత మోంటోయాను శవపేటికలో ఉంచి అంత్యక్రియలకు తీసుకెళ్లారు. దాదాపు 5 గంటల పాటు శవపేటికలోనే ఉన్న ఓ వృద్ధురాలు శవపేటికను తట్టి బంధువులకు షాక్ ఇచ్చింది. స్పృహలోకి వచ్చిన బెల్లా..శవపేటికను కాళ్లు, చేతులతో కొట్టడం ప్రారంభించింది. శవపేటిక నుండి వచ్చే శబ్దాలు విన్న బంధువులు షాక్ అయ్యారు. ఆమె బతికే ఉందని గ్రహించి.. నేరుగా ఈక్వెడార్‌లోని సెంట్రల్ సిటీ బాబాహోయోలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అధికారులు ఆమె పరిస్థితిని సీరియస్‌గానే ఉందని చెప్పారు. కోలుకోవడం కూడా కష్టంగానే ఉందని చెప్పిన వైద్యులు చికిత్స కొనసాగించారు.
కానీ, ఐసీయూలో చికిత్స పొందుతూ బెల్లా మోంటోయా జూన్ 16న మరణించారు. ఆమెను గతంలో తీసుకెళ్లిన అదే అంత్యక్రియల ప్రదేశానికి తీసుకెళ్లి ఖననం చేశారు. అయితే, మృతురాలు క్యాటలెప్సీ అనే వ్యాధితో బాధపడిందని వైద్యులు తెలిపారు. ఈ స్థితిలో వ్యక్తి మూర్ఛపోతారని, స్పృహ కోల్పోవడం, వారి శరీరం దృఢంగా మారటం వంటివి అనుభవిస్తారని చెప్పారు. ఇంటెన్సివ్ కేర్‌లో ఏడు రోజులు గడిపిన తర్వాత బెల్లా మోంటోయా స్ట్రోక్ బారినపడ్డారని ఈక్వెడార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మహిళకు కార్డియోస్పిరేటరీ అరెస్ట్ వచ్చిందని, దీని ఫలితంగా శ్వాసకోశ, గుండె పనితీరు పనిచేయకపోవడం జరిగిందన్నారు.
ఏది ఏమైనప్పటికీ, అంత్యక్రియలకు సిద్ధం చేసిన వృద్ధురాలు శవ పేటికలోంచి లేచిన సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిందిజ అలాగే, ఆమెను స్ట్రెచర్‌పైకి ఎక్కించి, అంబులెన్స్‌లోకి తరలించే ముందు పారామెడిక్స్ ఆమెను పరీక్షించడాన్ని కూడా వీడియో క్యాప్చర్ చేసింది. కానీ, చివరకు వారం రోజుల తర్వాత ఆమె మరణించినట్లు ప్రకటించారు.