WhatsApp: ఇది కదా అసలైన ఫీచర్‌ అంటే.. ఆ సమస్యకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమైన వాట్సాప్‌

వాట్సా్‌ప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ ఒక్క స్మార్ట్‌ ఫోన్‌లో కచ్చితంగా వాట్సాప్‌ ఉంటుందనేది కాదనలేని నిజం. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ఈ మెసేజింగ్ యాప్‌కు ఇంతటి క్రేజ్‌ ఉంది. యూజర్ల అవసరాలు మాత్రమే కాకుండా...

WhatsApp: ఇది కదా అసలైన ఫీచర్‌ అంటే.. ఆ సమస్యకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమైన వాట్సాప్‌
Whatsapp Calls
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 20, 2023 | 6:24 PM

వాట్సా్‌ప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ ఒక్క స్మార్ట్‌ ఫోన్‌లో కచ్చితంగా వాట్సాప్‌ ఉంటుందనేది కాదనలేని నిజం. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ఈ మెసేజింగ్ యాప్‌కు ఇంతటి క్రేజ్‌ ఉంది. యూజర్ల అవసరాలు మాత్రమే కాకుండా ప్రైవసీకి సైతం పెద్ద పీట వేస్తోంది వాట్సాప్‌. ఇందులో భాగంగా ఎన్నో రకాల సెక్యూరిటీ ఫీచర్లను వాట్సాప్‌ అందించింది.

ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌. ఇటీవలి కాలంలో అన్‌నోన్‌ నెంబర్స్‌ నుంచి వాట్సాప్‌ కాల్స్‌ రావడం అనే సమస్య ఎక్కువవుతోంది. విదేశీ నెంబర్ల నుంచి కొంత మంది సైబర్‌ నేరగాళ్లు యూజర్లకు గాలం వేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ అనే కొత్త ప్రైవసీ ఫీచర్‌ను తీసుకొస్తోంది. వాట్సాప్‌ కాల్స్‌ నియంత్రణ, స్పామ్‌ కాల్స్‌ నుంచి యూజర్లకు రక్షణ కల్పించడమే ఈ ఫీచర్‌ లక్ష్యంగా వాట్సాప్‌ చెబుతోంది.

ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌ యూజర్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే అన్‌వాంటెడ్‌ కాల్స్‌ను ఆటోమేటిక్‌గా స్క్రీన్‌ అవుటుంది చేస్తుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ ఫోన్‌ రింగ్ అవవు. కానీ కాల్‌ లిస్ట్‌లో కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..