Boult Crown R Pro: బౌల్ట్ నుంచి మరో నయా స్మార్ట్ వాచ్.. ప్రీమియం లుక్‌తో మతిపోగుడుతున్న ఫీచర్లు..
తాజాగా ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ బౌల్ట్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. బౌల్ట్ క్రౌన్ ఆర్ ప్రో పేరుతో రిలీజ్ చేసిన ఈ స్మార్ట్‌వాచ్ వాల్కానిక్ ఆరెంజ్, థండర్ బ్లాక్ సిలికాన్ స్ట్రిప్‌లతో పాటు ఫ్రోజెన్ సిల్వర్ మెటాలిక్ స్ట్రాప్‌తో వస్తుంది.
భారతదేశంలో స్మార్ట్ వాచ్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ స్మార్ట్ వాచ్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ బౌల్ట్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. బౌల్ట్ క్రౌన్ ఆర్ ప్రో పేరుతో రిలీజ్ చేసిన ఈ స్మార్ట్‌వాచ్ వాల్కానిక్ ఆరెంజ్, థండర్ బ్లాక్ సిలికాన్ స్ట్రిప్‌లతో పాటు ఫ్రోజెన్ సిల్వర్ మెటాలిక్ స్ట్రాప్‌తో వస్తుంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌వాచ్ క్రౌన్ ఫీచర్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది వినియోగదారులకు వివిధ మెనూల ద్వారా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా కేవలం ఒక ట్యాప్‌తో ఇష్టమైన వాటిని అనుకూలీకరించడానికి అనుమతిస్తుంది. ఈ వాచ్ ఫీచర్లు, ధర విషయాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ఈ బౌల్ట్ క్రౌన్ ఆర్ ప్రో వాచ్ 1.43 అంగుళాల సూపర్ అమోలెడ్ రౌండ్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే 500 నిట్స్ బ్రైట్‌నెస్, 466×466 రిజల్యూషన్‌తో పాటు ఎవ్రీ టైమ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వస్తుంది ఈ వాచ్ థండర్ బ్లాక్ & వోల్కానిక్ ఆరెంజ్ సిలికాన్ స్ట్రీప్స్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. బౌల్ట్ యొక్క క్రౌన్ ఆర్ ప్రో హెల్త్ కీపింగ్ సిస్టమ్, సుప్రీం బ్లూటూత్ టెక్నాలజీ, ఏఐ వాయిస్ అసిస్టెన్స్ ఫైండ్ మై ఫోన్ ఫీచర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ కొత్త స్మార్ట్‌వాచ్ హృదయ స్పందన రేటు, రక్తపోటు, ఎస్పీఓ2, నిద్ర, రుతుక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. రిమైండర్లను సెట్ చేయడంతో పాటు మల్టీ టాస్కింగ్‌గా సూపర్‌గా పని చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ సింగిల్-చిప్ బ్లూటూత్ 5 సపోర్ట్ చేయడంతో పాటు ప్రత్యేక మైక్, స్పీకర్‌తో వస్తుంది. ముఖ్యంగా వినియోగదారులు 10 మిమీ పరిధిలో ఒక-క్లిక్ ద్వారా కనెక్షన్‌ని పొందగలుగుతారు. ముఖ్యంగా ఫోన్ అవసరం లేకుండానే కాల్స్‌ను ఆన్సర్ చేయవచ్చు ముఖ్యంగా ఈ వాచ్‌లో ఫైండ్ మై ఫోన్ ఫీచర్ ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్‌వాచ్‌లో క్రికెట్, రన్నింగ్, సైక్లింగ్, బాస్కెట్‌బాల్, యోగా, స్విమ్మింగ్ వంటి 120 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఐపీ 67 ద్వారా వాటర్‌ప్రూఫ్ టెక్నాలజీతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ ఉండడంతో ఈ వాచ్ ఎప్పకటికప్పుడు ఆకట్టుకుంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..