Fire-Boltt Smartwatch: స్టెయిన్ లెస్ స్టీల్ స్మార్ట్ వాచ్ ఇది.. లుక్ ‘అల్టిమేట్’ అంతే.. ఫీచర్లు, ధర ఇతర వివరాలు ఇవి..

స్మార్ట్ వాచ్ ల బ్రాండ్లలో ప్రపంచంలో నంబర్ టూ బ్రాండ్ గా అవతరించిన ఫైర్ బోల్ట్.. మరో కొత్త ఫీచర్డ్ స్మార్ట్ వాచ్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఫైర్ బోల్ట్ అల్టిమేట్ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ వాచ్ లో 1.39 అంగుళాల రౌండ్ డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, ఐపీ68 రేటింగ్ ఉంటుంది.

Fire-Boltt Smartwatch: స్టెయిన్ లెస్ స్టీల్ స్మార్ట్ వాచ్ ఇది.. లుక్ ‘అల్టిమేట్’ అంతే.. ఫీచర్లు, ధర ఇతర వివరాలు ఇవి..
Fire Boltt Ultimate
Follow us
Madhu

|

Updated on: Jun 20, 2023 | 5:00 PM

ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్ లకు డిమాండ్ పెరిగింది. అందరూ అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్ లు కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో అన్ని కంపెనీలు తమ తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇటీవలే స్మార్ట్ వాచ్ ల బ్రాండ్లలో ప్రపంచంలో నంబర్ టూ బ్రాండ్ గా అవతరించిన ఫైర్ బోల్ట్.. మరో కొత్త ఫీచర్డ్ స్మార్ట్ వాచ్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఫైర్ బోల్ట్ అల్టిమేట్ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ వాచ్ లో 1.39 అంగుళాల రౌండ్ డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, ఐపీ68 రేటింగ్ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఫైర్ బోల్ట్ అల్టిమేట్ ధర, లభ్యత..

ఈ వాచ్ రెండు స్ట్రాప్ లతో మార్కెట్లోకి వచ్చింది. ఒకటి లెదర్, మరొకటి మెటాలిక్ స్ట్రాప్. లెదర్ స్ట్రాప్ వాచ్ ధర రూ. 1799కాగా, మెటాలిక్ వేరియంట్ ధర రూ. 1,999గా ఉంది. లెదర్ వేరియంట్ బ్లాక్, బ్రౌన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అలాగే మెటాలిక్ వేరియంట్ బ్లాక్, సిల్వర్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఫైర్ బోల్ట్ అధికారిక వెబ్ సైట్ తో పాటు, ఫ్లిప్ కార్ట్ లోనూ అందుబాటులో ఉంది.

ఫైర్-బోల్ట్ అల్టిమేట్ స్పెసిఫికేషన్లు..

ఫైర్-బోల్ట్ అల్టిమేట్ 240×240 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 1.39-అంగుళాల హెచ్ డీ రౌండ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్, బ్లూటూత్ 5.0 ఉన్నాయి. ఇది బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్లకు మద్దతు ఇస్తుంది. స్మార్ట్ వాచ్ ప్రత్యేక డయల్ ప్యాడ్‌కు మద్దతును అందిస్తుంది. కాల్ హిస్టరీని కూడా అందిస్తుంది. స్మార్ట్‌వాచ్‌లో 270 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. కాల్ చేయకుండానే ఒక వారం వరకు, కాలింగ్ ఫీచర్‌తో కనీసం మూడు రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ఫైర్-బోల్ట్ అల్టిమేట్ ఫీచర్లు ఇవి..

ఫైర్-బోల్ట్ అల్టిమేట్ వాచ్ హర్ట్ రేట్ మోనిటర్, బ్లడ్ ఆక్సిజన్ (SpO2) మోనిటరింగ్, స్త్రీ ఆరోగ్య సంరక్షణ వంటి ఫీచర్లు ఉంటాయి. వీటితో పాటు 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్‌లతో వస్తుంది. ఫైర్-బోల్ట్ అల్టిమేట్ కూడా ఐపీ68 రేటింగ్‌తో వస్తుంది. తాగునీరు, వాతావరణ అప్‌డేట్‌లు, కెమెరా నియంత్రణ, స్మార్ట్ నోటిఫికేషన్‌లు వంటి మరెన్నో రిమైండర్‌లను అందిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..