వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్ వాచ్
వన్ ప్లస్ నార్డ్ స్మార్ట్‌వాచ్ 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ వల్ల వేగవంతమైన పనితీరును అందిస్తుంది. ఇది చూడడానికి ప్రీమియం వాచ్ అనుభూతినిస్తుంది. 368 x 448 రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 1.78 -అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే ఈ వాచ్ ప్రత్యేకత. ఈ వాచ్‌లో హృదయ స్పందన రేటు, ఎస్పీఓ2 , నిద్ర ట్రాకింగ్,ఒత్తిడి ట్రాకింగ్, రుతు చక్రం ట్రాకింగ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్‌లో మొత్తం 105 స్పోర్ట్స్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి ఈ వాచ్ ధర రూ.4999గా ఉంది.