చక్కటి ఆరోగ్యానికి ఉత్తమ చిట్కా.. కాఫీలో చియా సీడ్స్ వేసి తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఆహారంలో మార్పుల వల్ల ఊబకాయం అనేది సాధారణ సమస్య. చాలా మంది బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్తుంటారు. కొందరు కొన్ని బరువు తగ్గించే ఔషధాలను వాడుతుంటారు. వాటికి బదులు ఇలాంటి నేచురల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల బరువు తగ్గి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
ఆధునిక జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్ బూమ్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతిఒక్కరికీ పెద్ద సవాలుగా మారింది. జంక్ ఫుడ్ వల్ల శరీర బరువు అదుపు తప్పుతోంది. మంచి ఆరోగ్యానికి సూత్రం మన చుట్టూ ఉన్న అనేక సహజ ఉత్పత్తులలోనే నెలకొని ఉంది. దీంతో శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాంటి ఆరోగ్యకర ఆహార పదార్థాల్లో చియా సీడ్స్ కూడా ఒకటి. చాలా మంది బరువు తగ్గడానికి చియా సీడ్స్ తీసుకుంటారు. ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ వహించే వారు కూడా చియా సీడ్స్‌ని వారి డైట్‌లో భాగంగా చేసుకుంటారు. అలా కొంతమంది నిమ్మరసం నీటిలో చియా గింజలను కలిపి తాగడానికి ఇష్టపడతారు. మరికొందరు చియా విత్తనాలను పెరుగుతో కూడా కలిపి తింటారు. బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించే చియా సీడ్స్ తినడం వల్ల ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
చియా విత్తనాలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది. చియా డ్రింక్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. చియా విత్తనాలను స్మూతీస్, జ్యూస్‌లు, పుడ్డింగ్‌లు మొదలైన వాటిని తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉన్నవారు కాఫీలో కూడా చియా సీడ్స్ వేసుకోవచ్చు. దీంతో శరీర బరువు చాలా త్వరగా తగ్గుతుంది.
చియా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. చియా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తీరుతుంది. చియా తీసుకోవడం వల్ల గట్, జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.అంతేకాదు.. చియా విత్తనాలు శక్తికి మూలంగా పనిచేస్తాయి. ఇందులో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఈ కారణంగా ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. దానివల్ల శరీరం ఎప్పుడూ శక్తితో నిండి ఉంటుంది. ముఖ్యంగా చియా సీడ్స్ ను కాఫీతో కలిపి తాగితే శరీరంలో శక్తి రెట్టింపు అవుతుంది. శరీరానికి లభించే సహజ శక్తి వల్ల మీరు ఎక్కువ కాలం చురుకుగా ఉండగలరు. ఆరోగ్యకరమైన శరీరానికి రోజుకు 20 గ్రాముల చియా విత్తనాలను తినవచ్చు. చియా విత్తనాలను తినే వ్యక్తులు జీర్ణ సమస్యలను నివారించడానికి నీరు పుష్కలంగా నీరు తాగాలి.
చియా గింజలలో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ తినాలనే కోరికను నియంత్రిస్తుంది. ఇది చాలా త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ప్రొటీన్ ఎప్పుడూ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ కారణంగా, చియా విత్తనాల వినియోగం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే బరువు తగ్గడం గమనించవచ్చు.
ఆహారంలో మార్పుల వల్ల ఊబకాయం అనేది సాధారణ సమస్య. చాలా మంది బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్తుంటారు. కొందరు కొన్ని బరువు తగ్గించే ఔషధాలను వాడుతుంటారు. వాటికి బదులు ఇలాంటి నేచురల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల బరువు తగ్గి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..