Odisha train accident: అవన్నీ అవాస్తవాలే..! సిగ్నల్‌ జేఈ అమీర్‌ ఖాన్‌ పరారీపై రైల్వే స్పష్టత..

సిబిఐ ప్రాథమిక దర్యాప్తులో అమీర్ ఖాన్ అనే సిగ్నల్ జూనియర్ ఇంజనీర్‌ను గుర్తు తెలియని ప్రదేశంలో ప్రశ్నించారు. జూనియర్ ఇంజనీర్ అమీర్ ఖాన్‌ను విచారించిన సీబీఐ ఆయన నివాసముంటున్న అద్దె ఇంటికి సీల్ వేసింది. ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రకారం..

Odisha train accident: అవన్నీ అవాస్తవాలే..! సిగ్నల్‌ జేఈ అమీర్‌ ఖాన్‌ పరారీపై రైల్వే స్పష్టత..
Odisha Train Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 20, 2023 | 7:17 PM

ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాద ఘటనలో సిగ్నల్‌ జేఈ అమీర్‌ ఖాన్‌ పై వస్తున్న వార్తలను CPRO సౌత్ ఈస్టర్న్ రైల్వే ఖండించింది. సిగ్నల్ జూనియర్ ఇంజనీర్‌ అమీర్‌ఖాన్‌ కుటుంబ సమేతంగా పరారైనట్టుగా వస్తున్న వార్తలను అవాస్తవంగా రైల్వే పేర్కొంది. ఇదంతా CBI, CRS విచారణలో భాగమేనని రైల్వే స్పష్టం చేసింది. సిగ్నల్ జేఈ అమీర్‌ ఖాన్‌ అధికారులకు అందుబాటులోనే ఉన్నారని, వారంతా పరారీలో ఉన్నారని, అదృశ్యమయ్యారనే వార్తలు కేవలం అవాస్తవంగా పేర్కొన్నారు. వారు ఏజెన్సీ ముందు హాజరవుతున్నారని CPRO సౌత్ ఈస్టర్న్ రైల్వే ఆదిత్య కుమార్ చౌదరి తెలిపారు.

సిబిఐ ప్రాథమిక దర్యాప్తులో అమీర్ ఖాన్ అనే సిగ్నల్ జూనియర్ ఇంజనీర్‌ను గుర్తు తెలియని ప్రదేశంలో ప్రశ్నించారు. జూనియర్ ఇంజనీర్ అమీర్ ఖాన్‌ను విచారించిన సీబీఐ ఆయన నివాసముంటున్న అద్దె ఇంటికి సీల్ వేసింది. ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రకారం లైన్‌లోని సిగ్నల్‌లో అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో కొంత జోక్యం ఉందని ప్రోబ్ సూచిస్తుంది. రైలు కార్యకలాపాల భద్రతను నిర్ధారించడంలో జూనియర్ ఇంజనీర్ కీలక పాత్ర పోషిస్తారని, సిగ్నల్స్, ట్రాక్ సర్క్యూట్‌లు, పాయింట్ మెషీన్‌లు, ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లతో సహా సిగ్నలింగ్ పరికరాల ఇన్‌స్టాలేషన్, నిర్వహణ, మరమ్మత్తులో పాల్గొంటారని ఇక్కడ గమనించాలన్నారు.

ఇవి కూడా చదవండి

జూన్‌ 2న జరిగిన ఈ ఘటనలో 292 మంది చనిపోయారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ జూన్ 2వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఆగివున్న ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఆ తర్వాత అదే ట్రాక్‌లో వస్తున్న మరో రైలు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.