Watch Video: పాటలు పాడుతూ స్నానం చేస్తున్న అమ్మాయి.. అంతలో కెవ్వుమంటూ కేకలు.. ఏం జరిగిందో చూస్తే హడలే..!
మనిషి ప్రశాంతంగా ఉండే ప్లేస్‌లు చాలా అరుదుగా ఉంటాయి. వాటిల్లో బాత్రూమ్ ఒకటి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. స్నానానికి వెళ్లిన వారు హాయిగా పాటలు పాడుకుంటూ, సరదాగా స్నానం పూర్తి చేస్తారు. ఇక అక్కడ కూడా ప్రశాంతత లేకపోతే? ఆ ప్రశాంతను ఎవరైనా చెడగొడితే..
మనిషి ప్రశాంతంగా ఉండే ప్లేస్‌లు చాలా అరుదుగా ఉంటాయి. వాటిల్లో బాత్రూమ్ ఒకటి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. స్నానానికి వెళ్లిన వారు హాయిగా పాటలు పాడుకుంటూ, సరదాగా స్నానం పూర్తి చేస్తారు. ఇక అక్కడ కూడా ప్రశాంతత లేకపోతే? ఆ ప్రశాంతను ఎవరైనా చెడగొడితే.. వారిపై చిరాకు పడతాం. మరి.. ఆ ప్రశాంతతను చెడగొట్టింది భయంకరమైన రాక్షస బల్లి అయితే? స్నానం చేస్తుండగా సడెన్‌గా మీ దగ్గరకు పెద్ద రాక్షస బల్లి వస్తే? పరిస్థితి ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉంటుంది. కానీ, ఇక్కడ ఓ మహిళకు అదే పరిస్థితి ఎదురైంది. ఇంకేముంది.. లబోదిబోమంటూ పరుగులుతీయడం ఆమె వంతైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఓ అమ్మాయి స్నానం చేస్తుండగా బాత్‌రూమ్ వెంటిలేటర్ నుంచి సడెన్‌గా ఓ భారీ రాక్షస బల్లి ఎంటరైంది. గోడమీద కూర్చుని అటూ ఇటూ చూస్తూ ఉండిపోయింది. దాని అలజడి విన్న అమ్మాయి.. భయంతో కెవ్వుమని అరిచింది. అయినా ఆ బల్లి ఏమాత్రం అదరలేదు, బెదరలేదు. పైగా ఇప్పుడు పూర్తిగా ఇంట్లోకి వచ్చేసింది. దాంతో హడలిపోయిన అమ్మాయి బాత్రూమ్ డోర్ వేసి బయటకు పరుగులు తీసింది.
ఈ భయానక సన్నివేశానికి సంబందించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రమ్‌లో rumahkumuh.id ఐడీ పేరుతో షేర్ చేశారు. భారీగా ఆ ఉన్న రాక్షస బల్లిని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ పరిస్థితి తమకు ఎదురైతే ఏలా ఉంటుందో ఊహించుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ‘మా ఇంట్లో ఇలా జరిగితే ఇక నా జీవితంలో ఆ ఇంటి ముఖం చూడను’ అంటూ ఓ అమ్మాయి రియాక్ట్ అయ్యింది. మరెందుకు ఆలస్యం.. ఈ షాకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..