- Telugu News Photo Gallery Viral photos Is keeping a parrot at home auspicious or inauspicious know here interesting details
Parrot: రామ చిలుకను ఇంట్లో పెంచుకోవడం శుభమా? అశుభమా? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..
రామ చిలుకను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ రామ చిలుకల్లో అనేక జాతులు ఉన్నాయి. చాలా మంది వీటిని తమ ఇళ్లలోనూ పెంచుకుంటారు.
Updated on: Jun 18, 2023 | 10:06 PM

రామ చిలుకను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ రామ చిలుకల్లో అనేక జాతులు ఉన్నాయి. చాలా మంది వీటిని తమ ఇళ్లలోనూ పెంచుకుంటారు.

రామ చిలుక అంటే ఇష్టంతో చాలా మంది వాటిని తమ తమ ఇళ్లలో సాదుతారు. మరి వాటిని ఇళ్లలో ఉంచుకోవడం శుభమేనా? అశుభం ఏమైనా ఉంటుందా? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మత గ్రంథాలు, విశ్వాసాల ప్రకారం.. చిలుకను ఇంట్లో పెంచుకోవడం చాలా వరకు శుభమే కలుగుతుందని చెబుతున్నారు.

చిలుకలను ఇంట్లో పెంచుకోవడం వల్ల అకాల మరణ ప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు పండితులు.

ఇంట్లో చిలుకలను ఉంచడం వల్ల పిల్లలకు చదువుతో పాటు.. జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుందని విశ్వాసం.

చిలుకను ఇంట్లో పెంచుకోవడం వల్ల దాంపత్య జీవితం మధురంగా ఉంటుందని చెబుతున్నారు. కాపురంలో ప్రశాంతత, సంతోషం ఉంటుంది.

అయితే, చిలకలను పంజరంలో బంధించడం సరికాదంటున్నారు. వాటిని స్వేచ్ఛగా సంచరించేలా చేస్తేనే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.




