- Telugu News Photo Gallery Science photos Why forgot childhood memories know about facts related to our brain
Knowledge News: బాల్యంలో జరిగిన విషయాలు ఎందుకు గుర్తుండవు? పరిశోధకులు చెప్పిన ఇంట్రస్టింగ్ వివరాలు..
మన శరీరంలోని అన్ని అవయవాలు వాటి స్వంత ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రతి అవయవం దాని విధిని నిర్వహిస్తుంది. కానీ మెదడు వాటన్నింటికంటే కూడా ప్రత్యేకమైనది. మరి మెదడుకు సంబంధించిన వివరాలు మీకు తెలుసా? ఈ రోజు మెదడుకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వివరాలు తెలుసుకుందాం..
Updated on: Jun 18, 2023 | 11:08 PM

మన శరీరంలోని అన్ని అవయవాలు వాటి స్వంత ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రతి అవయవం దాని విధిని నిర్వహిస్తుంది. కానీ మెదడు వాటన్నింటికంటే కూడా ప్రత్యేకమైనది. మరి మెదడుకు సంబంధించిన వివరాలు మీకు తెలుసా? ఈ రోజు మెదడుకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వివరాలు తెలుసుకుందాం..

మెదడుకు 5 నుంచి 10 నిమిషాల పాటు ఆక్సిజన్ అందకపోతే అది శాశ్వతంగా దెబ్బతింటుంది. మెదడు 40 ఏళ్ల వరకు ఎదుగుతూనే ఉంటుంది.

మెదడు 60% కొవ్వుతో తయారవుతుంది. ఇది శరీరంలో అత్యంత పెద్దగా ఉంటుంది. మెదడులో సగ భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు. అది వ్యక్తి జ్ఞాపకాలను ఏమాత్రం ప్రభావితం చేయదు. ఐదేళ్ల లోపు రెండు భాషలు నేర్చుకునే పిల్లల మెదడు నిర్మాణంలో కొన్ని మార్పులు వస్తాయి.

'హిప్పోకాంపస్' అభివృద్ధి చెందే వరకు ఏదైనా గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి, చిన్న తనంలో జరిగిన విషయాలు గుర్తుండవు. చిన్నపిల్లలు ఎక్కువగా నిద్రపోతారు. ఎందుకంటే వారి మెదడు వారి శరీరంలో తయారైన గ్లూకోజ్‌లో 50% వరకు ఉపయోగించుకుంటుంది. ఇతర వయస్సుల కంటే 2 సంవత్సరాల వయస్సు వారిలో ఎక్కువ మెదడు కణాలు ఉన్నాయి.

మెదడు జ్ఞాపకశక్తి అపరిమితంగా ఉంటుంది. కంప్యూటర్ లాగా మెమొరీ ఫుల్ అని ఎప్పటికీ చెప్పదు. శరీర పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. మనిషి మెదడు అన్ని జీవులలో అతిపెద్దది. మానవుడితో పోలిస్తే ఏనుగు మెదడు దాని శరీర పరిమాణంలో 0.15% మాత్రమే ఉంటుంది. మెదళ్ళు చాలా మృదువుగా ఉంటాయి.

మెదడు పిల్లల మనసును ప్రభావితం చేస్తుంది. టీవీ చూసే పిల్లల్లో మెదడు చాలా తక్కువగా ఉపయోగించబడుతుంది. ఈ కారణంగా పిల్లల మెదడు వేగంగా అభివృద్ధి చెందదు. కథలు చదవడం, వినడం ద్వారా పిల్లల్లో అభివృద్ధి వేగంగా ఉంటుంది. ఎందుకంటే పుస్తకాలు చదవడం వల్ల పిల్లల ఊహాశక్తి పెరుగుతంది. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్న ప్రతిసారీ, మెదడులో కొత్త ముడతలు ఏర్పడతాయి. ఈ ముడతలు IQకి నిజమైన కొలమానం.

మానవ మెదడులో నొప్పి కారకం ఏదీ లేదు. ఇందుకే ఇది నొప్పికి గురవదు. ఒత్తిడితో ఒక విషయం గురించే ఎక్కువసేపు ఆలోచించడం వల్ల మనస్సు ఏకాగ్రత కోల్పోతుంది. ఆలోచించి, అర్థం చేసుకుని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది.