Citizenship: అంతర్జాతీయ విమానంలో ప్రయాణిస్తుండగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. మరి ఆ బిడ్డకు ఏ దేశ పౌరసత్వం లభిస్తుంది?

పిల్లల పౌరసత్వం కోసం ప్రతి దేశంలోనూ వివిధ రకాల చట్టాలు ఉన్నాయి. భారతదేశంలో పౌరసత్వం అనేది.. వారి తల్లిదండ్రలు పౌరసత్వంపై ఆధారపడి ఉంటుంది. అంటే, తల్లిదండ్రులు భారతీయులు అయితే.. వారి బిడ్డ ఎక్కడ పుట్టినా భారతీయులే అవుతారు. ప్రపంచంలోని చాలా దేశాలు..

Citizenship: అంతర్జాతీయ విమానంలో ప్రయాణిస్తుండగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. మరి ఆ బిడ్డకు ఏ దేశ పౌరసత్వం లభిస్తుంది?
Born Baby
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 21, 2023 | 5:39 PM

పిల్లల పౌరసత్వం కోసం ప్రతి దేశంలోనూ వివిధ రకాల చట్టాలు ఉన్నాయి. భారతదేశంలో పౌరసత్వం అనేది.. వారి తల్లిదండ్రలు పౌరసత్వంపై ఆధారపడి ఉంటుంది. అంటే, తల్లిదండ్రులు భారతీయులు అయితే.. వారి బిడ్డ ఎక్కడ పుట్టినా భారతీయులే అవుతారు. ప్రపంచంలోని చాలా దేశాలు ఇదే విధమైన రూల్‌ను అనుసరిస్తున్నాయి. అయితే, కొన్ని దేశాలు మాత్రం తమ గడ్డపై పుట్టిన బిడ్డలను మాత్రమే తమ పౌరుడిగా పరిగణిస్తాయి.

అంటే బిడ్డ అమెరికా లేదా కెనడా లాంటి దేశంలో పుడితే అక్కడ ఎలాంటి షరతులు లేకుండా పౌరసత్వం లభిస్తుంది. ఇక ఇజ్రాయెల్ వంటి దేశాలు తమ మతం ఆధారంగా పౌరసత్వం ఇస్తున్నాయి. అంటే, ప్రపంచంలో ఎక్కడ పుట్టినా, వారు యూదులైతే చాలు ఇజ్రాయెల్ పౌరుడిగా గుర్తిస్తుంది. ప్రపంచంలో ఈ విధంగా పౌరసత్వం ఇచ్చే ఏకైక దేశం ఇజ్రాయెల్.

మరి శిశువు ఆకాశంలో పుడితే..?

ఒక అంతర్జాతీయ విమానం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళుతోంది అనుకుందాం. ఆ ప్రయాణ సమయంలోనే గర్భిణి తన బిడ్డకు జన్మనిస్తే? ఆ బిడ్డకు ఏ దేశ పౌరసత్వం లభిస్తుంది? అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. అమెరికా, కెనడా వంటి దేశంలో పిల్లల పౌరసత్వం కావాలంటే.. ఆ దేశాల్లోనే పుట్టాలనే నిబంధన ఉంది.

ఇవి కూడా చదవండి

విమానంలో ఎవరైనా జన్మిస్తారా?

ఇదిలాఉంటే.. విమానంలో ఎవరైనా జన్మిస్తారా? అనేది చాలా పెద్ద ప్రశ్న. అయితే, ఈ ప్రశ్నకు సమాధానం అసాధ్యమనే వినిపిస్తుంది. నిబంధనల ప్రకారం.. 36 వారాల గర్భవతి అయితే విమానంలో ప్రయాణించడానికి అనుమతించరు. అయితే, అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే అనుమతిస్తారు. వైద్యపరమైన కారణాలు చూపితే ప్రయాణానికి అనుమతిస్తారు.

చట్టాలు ఏం చెబుతున్నాయి..

పౌరసత్వానికి సంబంధించి వివిధ దేశాల్లో వివిధ చట్టాలు ఉన్నాయి. అమెరికా విషయానికి వస్తే, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఫారిన్ అఫైర్స్ మాన్యువల్ ప్రకారం.. విమానంలో బిడ్డ పుడితే, ఆ సమయంలో విమానం అమెరికా గగనతలంలో ఉంటే.. ఆ బిడ్డకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఇక పిల్లల తల్లిదండ్రులు రక్తసంబంధం ఆధారంగా పౌరసత్వం ఇచ్చే దేశానికి చెందిన వారైతే.. వారికి ఆ దేశ పౌరసత్వం కూడా లభిస్తుంది.

భారతదేశం, అమెరికాలను కలిపి పరిశీలిస్తే దీనిపై మీకు క్లారిటీ వస్తుంది. భారతీయ దంపతుల బిడ్డ విమానంలో జన్మించినట్లయితే, బిడ్డ పుట్టిన సమయంలో ఆ విమానం అమెరికా గగనతలంలో ఉంటే.. ఆ బిడ్డకు రెండు దేశాల పౌరసత్వం ఉంటుంది. మరి వారికి ఏ దేశ పౌరసత్వం కావాలనేది వారి నిర్ణయానుసారం ఉంటుంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
ఇవి లేకుండా బైక్ నడిపితే మీరూ నేరస్తులే! వెంటనే బండి సీజ్..
ఇవి లేకుండా బైక్ నడిపితే మీరూ నేరస్తులే! వెంటనే బండి సీజ్..
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఇలా క్లీన్ చేస్తే.. ఆరోగ్యంగా ఉంటారు
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఇలా క్లీన్ చేస్తే.. ఆరోగ్యంగా ఉంటారు
త్వరలోనే లక్ష మైలురాయిను చేరుకోనున్న సెన్సెక్స్..!
త్వరలోనే లక్ష మైలురాయిను చేరుకోనున్న సెన్సెక్స్..!
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.
కింగ్ ఖాన్ కావాలనే గ్యాప్ తీసుకుంటున్నారా.? ఎందుకంటే..!
కింగ్ ఖాన్ కావాలనే గ్యాప్ తీసుకుంటున్నారా.? ఎందుకంటే..!
ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ షురూ!
ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ షురూ!
దర్శకుడు, నిర్మాతతో ఒక రాత్రి ఒంటరిగా గడపాలని అడిగారు..
దర్శకుడు, నిర్మాతతో ఒక రాత్రి ఒంటరిగా గడపాలని అడిగారు..
అతిగా ఆవలింతలు, తిమ్మిరులు వస్తున్నాయా.. జాగ్రత్త పడాల్సిందే!
అతిగా ఆవలింతలు, తిమ్మిరులు వస్తున్నాయా.. జాగ్రత్త పడాల్సిందే!
అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో ప్రపంచకప్ హీరోలకు సన్మానం.. వీడియో
అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో ప్రపంచకప్ హీరోలకు సన్మానం.. వీడియో