Milk: వేసవిలో పాలు విరిగిపోకుండా ఉండేందుకు అద్భుత చిట్కాలు..

ఒకవేళ పాలను ఒక గిన్నెలోంచి మరో దాంట్లోకి మార్చవలసి వస్తే మార్చే గిన్నెను ముందుగా వేడి నీటితో కడుక్కోవాలి. లేదంటే ఒక గ్లాసు నీళ్లు పోసి కాసేపు స్టవ్‌మీద మరిగించాలి. ఇలా చేయటం వల్ల పాలు విరిగిపోయేందుకు అవకాశం ఉండదు.

Milk: వేసవిలో పాలు విరిగిపోకుండా ఉండేందుకు అద్భుత చిట్కాలు..
Milk From Curdling
Follow us

|

Updated on: Jun 19, 2023 | 3:45 PM

వేసవి కాలంలో అనేక ఆహార పదార్థాలు త్వరగా పాడైపోతుంటాయి. అలాగే, పాలు కూడా తరచూగా విరిగిపోతుంటాయి. అయితే, పాలు పాడవకుండా ఉండటానికి చాలా మంది పాలను ఒకసారి బాగా మరిగించి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. అయితే, ఫ్రిడ్జ్‌ లేనప్పుడు కూడా పాలు చాలా కాలం పాటు పాడవకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు అవసరం. అలాంటి అద్భుతమైన ట్రిక్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ఇలా చేస్తే మీరు పాలను ఫ్రిజ్‌లో ఉంచకుండా కూడా 24 గంటలు తాజాగా ఉంచవచ్చు. మీకు నమ్మకం లేకుంటే, మీరే ఒకసారి ప్రయత్నించండి. ఎందుకంటే,పాలు చాలా ఖరీదైనవి, తరచుగా విరిగిపోవటం వల్ల కూడా మీ బడ్జెట్‌ను ప్రభావితం చేస్తుంది.

పాలు వేడి చేయడానికి శుభ్రమైన పాత్రలను ఉపయోగించాలి.. కొన్నిసార్లు మనం పాత్రలు శుభ్రంగా ఉన్నాయని అనుకుంటాము. కానీ, అలా కాదు. అందుకే మీరు పాలు కాచినప్పుడల్లా, పాత్ర శుభ్రంగా ఉందో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. శుభ్రం చేసిన తర్వాత కూడా మరోసారి నీళ్లతో కడుక్కోవడం మంచిది. ఆ తరువాత పాత్రలో పాలు పోయడానికి ముందు ఆ గిన్నెలో కొన్ని నీళ్లు పోయాలి. ఇది పాలు పాత్ర అడుగున అంటుకోకుండా ఉంటుంది. క్రీమ్ బాగా పడుతుంది. వేసవిలో పాలు పెరుగుకాకుండా ఉండాలంటే 24 గంటల్లో నాలుగు సార్లు మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో గ్యాస్ మంటను సిమ్‌లో పెట్టుకోవాలి. ప్రతిసారీ రెండు మూడు సార్లు పాలు మరిగిన తర్వాతే గ్యాస్‌ను ఆఫ్ చేయండి. పాలు గోరువెచ్చగా అయిన తర్వాత ఒక ప్లేట్‌తో కొద్దిగా మూత పెట్టుకోవాలి. కొన్నిసార్లు పాలు పూర్తిగా మూతపెట్టినా కూడా విరిగిపోతుంటాయి.

అలాగే, మనం తరచూగా పాలను టైమ్‌కు మరిగించటం మరచిపోతుంటాము. ఇది పాలు విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో ఆ పాల్లల్లో కొంచం బేకింగ్ సోడా వేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని కోసం మీరు పాలను మరిగించేందుకు గానూ.. గ్యాస్ మీద ఉంచినప్పుడు దానికి చిటికెడు బేకింగ్ సోడా వేసి, ఒక చెంచా సహాయంతో కలపండి. ఇప్పుడు ఆ పాలు పగిలిపోకుండా ఉంటాయి. అయితే, ఇక్కడ బేకింగ్ సోడా అధికంగా వేస్తే కూడా పాలు పాడయ్యే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి. ఒకవేళ పాలను ఒక గిన్నెలోంచి మరో దాంట్లోకి మార్చవలసి వస్తే మార్చే గిన్నెను ముందుగా వేడి నీటితో కడుక్కోవాలి. లేదంటే ఒక గ్లాసు నీళ్లు పోసి కాసేపు స్టవ్‌మీద మరిగించాలి. ఇలా చేయటం వల్ల పాలు విరిగిపోయేందుకు అవకాశం ఉండదు.

ఇవి కూడా చదవండి

పాలు తాగేటప్పుడు ఇలాంటి 5 సాధారణ తప్పులు సర్వసాధారణంగా అందరూ చేస్తుంటారు. ప్యాక్ చేసిన పాలను ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది క్రిమిరహితంగా, సంరక్షించబడటానికి ఇప్పటికే పాశ్చరైజ్ చేయబడింది. దీని కారణంగా మళ్లీ వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు తగ్గుతాయి. కాబట్టి ఇంటికి వచ్చిన కొద్ది గంటల్లోనే పాలను వాడేయటం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి