మృత్యు శిఖరం.. ! ఎవరెస్ట్ పర్వతం ఎందుకు శవాల దిబ్బగా మారుతుందో తెలుసా..?
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం ఎంతో సాహసోపేతమైన పని. ఏటా వందల మంది ప్రయత్నిస్తే అతికొద్ది మంది మాత్రమే ఆ శిఖరం పై వరకూ చేరుకోగలుగుతారు. అయితే, కొందరు పర్వతారోహకులు మధ్యలోనే ప్రాణాలు వదులుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (8,848 మీటర్లు) ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఈ పర్వతంపై మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.