Chanakya Niti: క్లిష్ట సమయాల్లో వీటిని తప్పక గుర్తుంచుకోండి.. ఎప్పటికీ మీరే పైచేయి సాధిస్తారు..!

WhatsApp New Feature: ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేది సాధారణ అంశం. కష్టం వచ్చిందని కుంగిపోవడం, సంతోషం వచ్చిందని పొంగిపోవడం సరికాదు. అన్నివేళలా సానుకూల దృక్పథంలో ముందుకు కదలాలి. అదే విజయవంతమైన జీవితానికి బాటలు వేస్తుంది.

Chanakya Niti: క్లిష్ట సమయాల్లో వీటిని తప్పక గుర్తుంచుకోండి.. ఎప్పటికీ మీరే పైచేయి సాధిస్తారు..!
Chanakya Niti
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 19, 2023 | 10:00 AM

ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేది సాధారణ అంశం. కష్టం వచ్చిందని కుంగిపోవడం, సంతోషం వచ్చిందని పొంగిపోవడం సరికాదు. అన్నివేళలా సానుకూల దృక్పథంలో ముందుకు కదలాలి. అదే విజయవంతమైన జీవితానికి బాటలు వేస్తుంది. ముఖ్యంగా వ్యక్తి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. చెడు సమయాలు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో సానుకూల దక్పథాన్ని ఎలా కొనసాగించాలో చాణక్య నీతి చెబుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా వ్యవహారించాలనే విషయంలో చాణక్య నీతి మార్గనిర్దేశం చేసే కొన్ని సూత్రాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నిజాయితీ: వ్యక్తి జీవితంలో నిజాయితీ, చిత్తశుద్ధి చాలా ముఖ్యం అని ఆచార్య చాణక్యుడు చాలా స్పష్టంగా చెప్పారు. నిజాయితీ లేని చర్యలకు పాల్పడటం వల్ల వ్యక్తి ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు.. సంబంధాలకు హానీ కలుగుతుంది. నిజాయితీ ఇతరుల మనస్సులో నమ్మకాన్ని కలిగిస్తుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరమైన రంగాలలో విజయానికి నమ్మకం అనేది చాలా కీలకం.

వాయిదా వేయడం: ముఖ్యమైన పనులు, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం, వాయిదా వేయడం వల్ల చాలా అవకాశాలు కోల్పోతారు. అంతేకాదు.. ఇది వ్యక్తిగత వృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. వాయిదా వేయడం వలన సమయం వృథా అవుతుంది. అనవసరమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే.. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

స్వీయ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి: చెడు సమయాలు వ్యక్తి పెరుగుదల, అభివృద్ధికి అవకాశంగా ఉపయోగపడతాయి. నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, కొత్త విషయాలను తెలుసుకోవడానికి, మీ బలహీనతలను బలోపేతం చేయడానికి ఈ కాలాన్ని ఉపయోగించుకోవాలి. నిరంతర స్వీయ అభివృద్ధి భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కోవడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది.

స్వీకరించే తత్వం, సయమానుకూలంగా స్పందించే తత్వం: సంక్షోభ సమయాల్లో, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. మీ విధానంలో సరళంగా ఉండటం చాలా అవసరం. దృఢంగా ఉంటూ, మార్పులను స్వీకరించే తత్వం ఉండాలి. లేదంటే మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. కొత్త ఆలోచనలను స్వీకరించాలి. అవసరమైన విధంగా వ్యూహాలను సర్దుబాటు చేయాలి.

విశ్లేషణ, వ్యూహరచన: పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించి, సవాళ్లను అధిగమించడానికి వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించాలని చాణక్యుడు సూచించాడు. సమస్యను తమకు అనుకూలంగా మార్చుకుని, వాటిని క్రమపద్ధతిలో పరిష్కరించేందుకు కృషి చేయాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ