Jagannath Rath Yatra: రేపు జగన్నాథుడి రథ యాత్ర ప్రారంభం.. అన్నా చెల్లితో కలిసి గుడించా ఇంటికి వెళ్లి విందారగించే కన్నయ్య

జగన్నాథుడు సనాతన ధర్మంలో విష్ణువు అవతారంగా భావించి పూజిస్తారు. జగన్నాథుడు అంటే  ప్రపంచం మొత్తానికి నాథుడు లేదా విశ్వానికి ప్రభువు అని అర్ధం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథుని రథయాత్ర జరిగే నగరాన్ని శ్రీ జగన్నాథ పూరి అని కూడా పిలుస్తారు. రథయాత్రలో జగన్నాథుడు, సోదరుడు బలభద్ర, సోదరి సుభద్ర సహా రథంలో కూర్చుని నగర పర్యటనకు వెళ్లారు.  

Jagannath Rath Yatra: రేపు జగన్నాథుడి రథ యాత్ర ప్రారంభం.. అన్నా చెల్లితో కలిసి గుడించా ఇంటికి వెళ్లి విందారగించే కన్నయ్య
Jagannath Rath Yatra
Follow us
Surya Kala

|

Updated on: Jun 19, 2023 | 8:57 AM

ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ రథయాత్ర ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున ప్రారంభం అవుతుంది. రథయాత్ర ను 10 రోజులపర్వదినంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కాగా ఈ సంవత్సరం జగన్నాథ రథయాత్ర జూన్ 20, 2023న ప్రారంభం కానుంది. ఇప్పటికే జగన్నాథుడి రత్యయాత్రకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. జగన్నాథుని ఈ రథయాత్రలో పాల్గొనే భక్తుడు సకల తీర్థయాత్రల ఫలాలను పొందుతాడని హిందువుల విశ్వాసం. రేపు ప్రారంభం కానున్న జగన్నాథుని రథయాత్ర గురించి  తెలుసుకుందాం.

వాస్తవానికి జగన్నాథుడు సనాతన ధర్మంలో విష్ణువు అవతారంగా భావించి పూజిస్తారు. జగన్నాథుడు అంటే  ప్రపంచం మొత్తానికి నాథుడు లేదా విశ్వానికి ప్రభువు అని అర్ధం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథుని రథయాత్ర జరిగే నగరాన్ని శ్రీ జగన్నాథ పూరి అని కూడా పిలుస్తారు. రథయాత్రలో జగన్నాథుడు, సోదరుడు బలభద్ర, సోదరి సుభద్ర సహా రథంలో కూర్చుని నగర పర్యటనకు వెళ్లారు.

రథయాత్రలో సోదరుడు, సోదరితో అత్త ఇంటికి వెళ్లే జగన్నాథుడు 

ఇవి కూడా చదవండి

మత విశ్వాసం ప్రకారం జగన్నాథ రథయాత్ర సమయంలో జగన్నాథుడు రథం విహారం చేస్తూ తన అత్త ఇంటికి గుండిచాకు వెళ్తాడు. గుండిచా ఆలయం జగన్నాథుని అత్త ఇల్లుగా పరిగణించబడుతుంది. ఇందులో జగన్నాథుడు తన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రతో కలిసి పర్యటనకు వెళ్తాడు. అక్కడ వారం రోజులు ఉంటారు. అక్కడ వారికి గౌరవం లభిస్తుంది.

కన్నయ్య తన మేనత్త ఇంట్లో తన తోబుట్టువులతో కలిసి విందును ఆరగిస్తాడని.. రకరకాల వంటకాలు తింటాడని విశ్వాసం. తర్వాత ఏడు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. అజ్ఞాతవాసం ముగిసిన అనంతరం జగన్నాథుడు భక్తులకు దర్శనం ఇస్తాడు.

రథయాత్ర పండుగ ప్రాముఖ్యత ఏమిటి? పురాణాల ప్రకారం జగన్నాథుని క్షేత్రం చార్ ధామ్ యాత్రలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచారు. జగనాథుడి  రథయాత్రలో పాల్గొన్న భక్తుడికి 100 యాగాలకు సమానమైన పుణ్యఫలాలను పొందుతాడని నమ్ముతారు. ఈ రథ యాత్రకు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు, తమ కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఈ దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో రథయాత్రలో పాల్గొనడానికి వస్తారు. జగన్నాథుడి రథయాత్ర పురీ క్షేత్రంలో పాటు, దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా చాలా వైభవంగా జరుపుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).