AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashadha Amavasya: అమావాస్య రోజున చేసే నది స్నానం, దానం వలన శుభ ఫలితాలు.. పితృదోష నివారణకు చేయాల్సిన చర్యలు

పిత్రా దోషం వల్ల ఇబ్బంది పడే వారు ఆ దోషం నుంచి విముక్తి పొందేందుకు అమావాస్య తిథి రోజున కొన్ని చర్యలు తీసుకోసుకోవాలని మత విశ్వాసం. ఈ రోజు ఆషాఢమాసం రానున్న నేపథ్యంలో అమావాస్య నాడు చేసే పితృపూజ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.

Ashadha Amavasya: అమావాస్య రోజున చేసే నది స్నానం, దానం వలన శుభ ఫలితాలు.. పితృదోష నివారణకు చేయాల్సిన చర్యలు
Ashadam Amavasya
Surya Kala
|

Updated on: Jun 18, 2023 | 7:40 AM

Share

హిందూమతంలో అమావాస్య తిథికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. పంచాంగం ప్రకారం.. కృష్ణ పక్షంలోని పదిహేనవ రోజును అమావాస్య అంటారు. ఈ అమావాస్య తిథి రోజున ప్రత్యేక పూజలు, పరిహారాలు చేయడం వల్ల జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. సనాతన ధర్మంలో అమావాస్య తిథి రోజున చేసే స్నానం, దానంతో పాటు పూర్వీకుల ఆరాధన అత్యంత ప్రాముఖ్యత ఉంది.

పిత్రా దోషం వల్ల ఇబ్బంది పడే వారు ఆ దోషం నుంచి విముక్తి పొందేందుకు అమావాస్య తిథి రోజున కొన్ని చర్యలు తీసుకోసుకోవాలని మత విశ్వాసం. ఈ రోజు ఆషాఢమాసం రానున్న నేపథ్యంలో అమావాస్య నాడు చేసే పితృపూజ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.

ఆషాఢ మాసం అమావాస్య రోజున చేయాల్సిన పరిహారాలు 

ఇవి కూడా చదవండి
  1. జాతకంలో పితృదోషం ఉన్నవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆషాఢమాసం అమావాస్య రోజున  తలస్నానం చేయాలని నమ్మకం. ఇలా స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలిపి స్నానం చేయడం అత్యంత విశిష్టత.
  2. జాతకంలో కాల సర్ప దోషం ఉన్నవారు అమావాస్య తిథి నాడు వెండితో చేసిన పాములను పూజించి ప్రవహించే నదిలో విడిచి పెట్టడం వలన దోష పరిహారం జరుగుతుందని విశ్వాసం.
  3. అమావాస్య రోజున ముందుగా తమ పూర్వీకులను ధ్యానించాలి. తర్వాత పూర్వీకుల త్యాగాలను స్మరించుకోవాలి.
  4. పూర్వీకుల కోసం దక్షిణ దిశ ఉత్తమం. మరోవైపు తర్పణం లేదా పిండ ప్రధానం మొదలైన  కార్యక్రమాలను నిర్వహించాలి. తర్వాత పూర్వీకులకు బియ్యం సాయసం,గారెలు సమర్పించండి. పితృ దోష నివారణకు పూర్వీకుల కోసం ఈ ప్రక్రియను పూర్తి చేసిన వ్యక్తికి అతని పెద్దల ఆశీర్వాదం లభిస్తుందని..  సంతోషంగా ఉంటాడని నమ్మకం.
  5. జీవితానికి సంబంధించిన కష్టాలు తొలగిపోవాలంటే నల్లచీమలకు పంచదార కలిపిన పిండిని, చేపలకు పిండితో చేసిన బాల్స్‌ను అమావాస్య రోజున ఆహారాన్ని అందించండి.
  6. ఆషాఢమాసంఅమావాస్య రోజున నదీస్నానం చేసి.. ఇచ్చే దానానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. అటువంటి పరిస్థితిలో  అమావాస్య నాడు పూజ చేసిన తర్వాత, అవసరమైన వారికి ఆహారం, బట్టలు మొదలైనవి దానం చేయండి.
  7. ఆషాఢ అమావాస్య రోజున రావి చెట్టు వద్ద పూజ చేసి ..  పాలు, పంచదార కలిపి అర్ఘ్యం సమర్పించి  నైవేద్యంగా పెడితే పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఆషాడం అమావాస్య రోజున ఈ పరిహారాలు చేయడం వలన జాతకంలో పితృ దోషం తొలగిపోతుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).