Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vipreet Raj Yoga: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో బృహస్పతి సంచారం.. ఈ 2 రాశులకు లాభాల పంట, పెళ్లి కుదిరే అవకాశం..

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బృహస్పతి మేషరాశిలో తొమ్మిదవ, పన్నెండవ ఇంటికి అధిపతి.. దీంతో గురుడు అదృష్ట ఇంట్లోకి ప్రవేశించాడు. రాశిచక్రంలో 6వ, 8వ, 12వ గృహాల అధిపతులు కూటమిగా ఏర్పడినప్పుడు వ్యతిరేక యోగం ఏర్పడుతుంది.

Vipreet Raj Yoga: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో బృహస్పతి సంచారం.. ఈ 2 రాశులకు లాభాల పంట, పెళ్లి కుదిరే అవకాశం..
Vipreet Raj Yoga
Follow us
Surya Kala

|

Updated on: Jun 17, 2023 | 7:00 AM

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం దేవతల గురువు బృహస్పతి ఏప్రిల్ నెలలో మేషరాశిలోకి ప్రవేశించాడు. ఇలా 12 ఏళ్ల తర్వాత జరిగింది. బృహస్పతి మేషరాశిలో సంచరించడం వలన వ్యతిరేక యోగం ఏర్పడింది. ఈ యోగం రెండు రాశుల వారికి శుభప్రదం కానుంది. వ్యతిరేక యోగ ప్రభావం వల్ల ధనలాభంతో పాటు వివాహం కానీ యువతీ యువకులకు వివాహం కూడా జరుగుతుంది. ఈ రోజు ఆ రెండు రాశుల గురించి తెలుసుకుందాం.

వ్యతిరేక యోగం ఎప్పుడు ఏర్పడుతుందంటే? 

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బృహస్పతి మేషరాశిలో తొమ్మిదవ, పన్నెండవ ఇంటికి అధిపతి.. దీంతో గురుడు అదృష్ట ఇంట్లోకి ప్రవేశించాడు. రాశిచక్రంలో 6వ, 8వ, 12వ గృహాల అధిపతులు కూటమిగా ఏర్పడినప్పుడు వ్యతిరేక యోగం ఏర్పడుతుంది. ఇంకా సరళంగా చెప్పాలంటే, 6వ ఇంటి అధిపతి 8వ లేదా 8వ ఇంట్లో లేదా 12వ ఇంటి అధిపతి 6వ లేదా 8వ ఇంట్లో ఉంటే వ్యతిరేక రాజయోగం ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి

మిధునరాశి

బృహస్పతి మిథున రాశిలో లగ్న గృహంలో సంచరిస్తున్నాడు. దీంతో ఈ యోగం మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది . ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు మళ్ళీ పూర్తి కావడం మొదలవుతుంది. ఉద్యోగులు తమ పని తీరుతో ప్రశంసలను అందుకుంటారు. అంతేకాదు ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడి లాభాలను ఇస్తుంది. పిల్లలు నుంచి సంతోషకరమైన వార్త వింటారు. ఈ రాశి కి చెందిన వివాహం కానీ యువతీ యువకులకు పెళ్లి కుదిరే అవకాశాలున్నాయి. అంతేకాదు ఈ రాశి విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశిలో బృహస్పతి తొమ్మిదవ ఇంటికి, ఆరవ ఇంటికి అధిపతి. బృహస్పతి ఈ రాశికి చెందిన జాతకంలోని పదవ ఇంట్లో సంచరించనున్నాడు. అటువంటి పరిస్థితిలో వ్యతిరేక యోగం ఈ రాశికి చెందిన వారికి శుభఫలితాలను ఇస్తుంది. అంతేకాదు ఈ రాశి వ్యక్తులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.  ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు మళ్ళీ పట్టాలెక్కుతాయి. దాంపత్య జీవితంలో సంతోషం నెలకొంటుంది. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ వ్యతిరేక యోగం వలన స్వల్పంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).