Laxmi Puja Tips: శుక్రవారం పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది..
ఒకొక్కసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. దీనికి కారణం లక్ష్మీదేవి అనుగ్రహం లోపించడమే కారణం అని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. నిత్యజీవితంలో తెలిసో తెలియకో చాలాసార్లు చేసే పొరపాట్ల వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
ప్రతి వ్యక్తి తన జీవితం సుఖ సంపదలతో సాగిపోవాలని కోరుకుంటాడు. సుఖమైన జీవితం కోసం డబ్బులను సంపాదించడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తాడు. డబ్బు సంపాదన కోసం శ్రమతో పాటు, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు, ఉపవాసాల సహా అన్ని ప్రయత్నాలు చేస్తాడు. అయితే ఒకొక్కసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. దీనికి కారణం లక్ష్మీదేవి అనుగ్రహం లోపించడమే కారణం అని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. నిత్యజీవితంలో తెలిసో తెలియకో చాలాసార్లు చేసే పొరపాట్ల వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కనుక లక్ష్మీదేవికి కోపం తెచ్చే పనులు కొన్ని చేయకూడదని చెబుతున్నారు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
స్త్రీలను గౌరవించని చోట:
స్త్రీలను లక్ష్మీ స్వరూపం అంటారు. ఆడవాళ్ళని గౌరవించని ఇళ్ళల్లో స్త్రీలను దూషణలు చేసి అవమానించే ఇంటిలో లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదు. డబ్బుల కష్టాలు మొదలవుతాయి. అందుకే స్త్రీలను ఎప్పుడూ గౌరవించాలి.
బద్ధకం, ఆలస్యంగా నిద్రపోవడం:
సోమరిపోతులు నివసించే ఇళ్లలో లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడదు. సోమరిపోతులు ఉన్న ఇంట్లో లక్ష్మిదేవి ఎక్కువ కాలం ఉండదు. సూర్యోదయం వరకు నిద్రించేవారిని రాక్షస స్వభావం గలవారిగా పరిగణిస్తారు. అలాంటి వారిపై లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట.
అపరిశుభ్ర పరిసరాల్లో ఇంట్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపకుండా.. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం ఉండే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. అపరిశుభ్రత ఉన్న ఇంట్లో దారిద్య్రం తాండవిస్తుంది. అందుకే ఐశ్వర్య దేవత లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే సాయం సంధ్య సమయంలో ఇంటిని ఊడ్చకూడదు.
దీపం వెలిగించని ఇంట్లో ఉదయం, సాయంత్రం పూజలు చేయని , దీపం వెలిగించని ఇంట్లో వారిపై లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందట. అంతేకాదు శుక్రవారం అప్పు ఇవ్వడం, కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వడం లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణం అవుతుందట
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).