Astro Tips on Thursday: గురువారం ఈ పనులు చేస్తున్నారా.. విష్ణువు ఆగ్రహంతో ఆర్ధిక ఇబ్బందులు, అష్టకష్టలు పడాల్సిందేనట..

గురువారం గురువు పూజతో ప్రతి వ్యక్తి జీవితంలో సంతోషం సంపద ఉంటుంది. వివాహం కానీ యువతీయువకులకు గురువారం పూజ ఫలాన్ని ఇస్తుంది. అంతే కాదు సంతానం లేని దంపతులు గురువారం పూజాదికార్యక్రమాలను చేస్తారు. ప్రతి గురువారం ప్రత్యేక ఉపవాస దీక్షను చేస్తారు. అయితే గురువారం రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయరాదని పేర్కొన్నారు.

Astro Tips on Thursday: గురువారం ఈ పనులు చేస్తున్నారా.. విష్ణువు ఆగ్రహంతో ఆర్ధిక ఇబ్బందులు, అష్టకష్టలు పడాల్సిందేనట..
Thursday Puja Tips
Follow us
Surya Kala

|

Updated on: Jun 15, 2023 | 6:55 PM

హిందూ సంప్రదాయంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకింతం చేయబడింది. గురువారం శ్రీ మహా విష్ణువుకి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున భగవంతుడు శ్రీ హరిని భక్తితో పూజిస్తే సుఖ సంతోషాలు సంపద లభిస్తుందని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రంలో గురువారం బృహస్పతి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. దీంతో గురువారం గురువు పూజతో ప్రతి వ్యక్తి జీవితంలో సంతోషం సంపద ఉంటుంది. వివాహం కానీ యువతీయువకులకు గురువారం పూజ ఫలాన్ని ఇస్తుంది. అంతే కాదు సంతానం లేని దంపతులు గురువారం పూజాదికార్యక్రమాలను చేస్తారు. ప్రతి గురువారం ప్రత్యేక ఉపవాస దీక్షను చేస్తారు.  అయితే గురువారం రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయరాదని పేర్కొన్నారు. కొన్ని పనులు చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తుందట.. ఈరోజు గురువారం రోజున చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..

  1. గురువారం జుట్టు కత్తిరించుకోకూడదు.  జుట్టు కత్తిరించుకోవడం వలన దేవ గురువు బృహస్పతికి కోపం వస్తుందట. దీంతో అలా గురువారం జుట్టు కత్తిరించుకునే వ్యక్తి జీవితంలో అనుకోని ఇబ్బందులు కలుగుతాయట.
  2. గురువారం రోజున ముఖ్యంగా మహిళలు తలంటుకోవడం నిషేధం. ఏ ఇంట్లో మహిలు గురువారం అభ్యంగ స్నానం చేస్తారో ఆ ఇంట్లో డబ్బుకి ఇబ్బందులు తప్పవట.
  3. గురువారం రోజున మాసిన బట్టలు ఉతకకూడదు. గురువారం సబ్బు, షాంపూ వాడటం వల్ల గురువు స్థానం  బలహీనపడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
  4. అంతేకాదు గురువారం గోళ్లు కూడా కత్తిరించకూడదు. ఈ రోజున ఈ పనులు చేయడం వల్ల గురువు బలహీన పడతాడట. దీంతో ఇంటిలోని సుఖసంతోషాలు, సంపదలు పోతాయని నమ్మకం.
  5. ఇవి కూడా చదవండి
  6. గురువారం రుణ లావాదేవీలు చేయరాదు .. అంతేకాదు గురువారం స్నానము చేయకుండా ఉండకూడదు.
  7. ముఖ్యంగా గురువారం ఉపవాసం చేసే వారు అరటిపండ్లు, అన్నంతో ఉన్న ఆహారపదార్ధాలను తినడం నిషేధం.
  8. అంతేకాదు గురువారం రోజున ఇంటిని శుభ్రం చేయకుండా బయటకు వెళ్లడం అశుభ ఫలితాలను ఇస్తుంది.

గురువారం ప్రాముఖ్యత.. చేయాల్సిన పనులు  గురువారం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకోవాలి. తెల్లవారుజామున స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి.  అరటి చెట్టును, శ్రీ మహా విష్ణువును పూజించాలి. నైవేద్యంగా బెల్లం, శెనగపప్పు, అరటిపండ్లును సమర్పించాలి. విష్ణు పూజలో పసుపు, చందనం, పసుపు రంగు పుష్పాలను సమర్పించాలి. పూజ ముగింపు సమయంలో శ్రీ మహా విష్ణువు ప్రసన్నం కోసం గురువారం ఉపవాస కథను చదివి.. విష్ణు సహస్రనామాలు తో పూజ చేసి హారతిని ఇవ్వాలి. ఈ రోజు ఉపవాసం చేసే వారు పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. అరటి పండ్లకు దూరంగా ఉండాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).