Jagannath Temple: పురీ జగన్నాథ ఆలయంలో ఈ ఐదు రహస్యాలు.. సైన్స్ కూడా చేధించని నిజాలు..
జగన్నాథుని దర్శనం కోసం ప్రతిరోజూ భారతదేశంనుంచి మాత్రమే కాదు విదేశాల నుండి కూడా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. పూరీలోని ఈ ఆలయం కృష్ణ భగవానుడికి అంకితం చేయబడింది. ఇక్కడ శ్రీకృష్ణుడిని జగన్నాథుడు అని పిలుస్తారు.

ఒడిశాలోని పూరీలో ఉన్న అతి ప్రాచీన ప్రముఖ హిందూ దేవాలయం జగన్నాథ దేవాలయం. విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఇలా వైకుంఠంగా ఖ్యాతిగాంచింది ఈ క్షేత్రం. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. జగన్నాథ దేవాలయంలోని విగ్రహాల్లో ఒకటైన శ్రీ కృష్ణుడి విగ్రహంలో హృదయం కొట్టుకుంటుందని హిందువుల విశ్వాసం.
సనాతన సంప్రదాయంలో జగన్నాథ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది. జగన్నాథుని దర్శనం కోసం ప్రతిరోజూ భారతదేశంనుంచి మాత్రమే కాదు విదేశాల నుండి కూడా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. పూరీలోని ఈ ఆలయం కృష్ణ భగవానుడికి అంకితం చేయబడింది. ఇక్కడ శ్రీకృష్ణుడిని జగన్నాథుడు అని పిలుస్తారు. హిందూమతంతో సంబంధం ఉన్న నాలుగు ప్రధాన తీర్థయాత్రల్లో ఒకటి పూరి క్షేత్రం. ఈ ఆలయంలో కృష్ణుడు తన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రతో పాటు చెక్క విగ్రహాల రూపంలో భక్తులకు దర్శనం ఇస్తాడు.
చేధించలేని ఐదు రహస్యాలు ఈ పూరి ఆలయం సొంతం..




- జగన్నాథ ఆలయంలో ప్రసాదం వండడానికి 7 పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచుతారు. అందులో పై భాగంలోని ప్రసాదాన్ని ముందుగా వండుతారు. అనంతరం ప్రసాదం క్రింది వైపు నుండి ఒకదాని తర్వాత ఒకటి వండుతారు. ఇది ఇప్పటికీ ఆశ్చర్యకరమైన సంఘటనగా నిలిచిపోయింది.
- ఆలయంలో పగటిపూట సముద్రం నుండి భూమికి గాలి వీస్తుందని నమ్ముతారు. సాయంత్రం సమయంలో భూమి నుండి సముద్రం వైపు గాలి వీస్తుంది. జగన్నాథ ఆలయ శిఖరంపై ఉన్న జెండా ఎప్పుడూ గాలికి ఎదురుగా రెపరెపలాడుతూ ఉంటుంది.
- జగన్నాథ దేవాలయం ఎత్తు దాదాపు 214 అడుగులు ఉంటుందని విశ్వాసం. అటువంటి పరిస్థితిలో.. జంతువులు, పక్షుల నీడ కనిపిస్తూ ఉండాలి. అయితే ఈ ఆలయ శిఖరం నీడ ఎల్లప్పుడూ కనిపించదు.
- పూరీలోని జగన్నాథ దేవాలయం మీదుగా విమానం ఎగరదు. ఏ పక్షి కూడా గుడి పైభాగంలో నుంచి ఎగరదు. ఇలాంటి వింత భారతదేశంలోని ఏ దేవాలయంలోనూ జరగదు.
- జగన్నాథునితో సహా మూడు విగ్రహాలను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు. కొత్త విగ్రహాలను ప్రతిష్టిస్తారు. దేవుడి విగ్రహాలను మార్చే సమయంలో నగరంలో కరెంటు నిలిపివేస్తారు అంతేకాదు ఆలయం వెలుపల భారీగా భద్రతా బలగాలను మోహరిస్తారు. ఆ సమయంలో పూజారి మాత్రమే ఆలయంలోకి ప్రవేశిస్తాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).