Wednesday Puja Tips: బుధవారం పొరపాటున కూడా ఈ పనులు చేస్తున్నారా.. జీవితాంతం బాధలు పడాల్సిందే..
బుధవారం పచ్చని బట్టలు ధరించడం వల్ల బుధ గ్రహం శుభ ఫలితాలను ఇస్తాడు. అయితే బుధవారం కొన్ని పనులు చేయడం వల్ల వ్యక్తి జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బుధవారం నాడు చేయకూడని పనుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం బుధ గ్రహానికి అంకితం చేయబడింది. అంతేకాదు బుధవారం వినాయకుడిని పూజించడం వల్ల జాతకంలో బుధ గ్రహం బలపడుతుంది. అంతేకాదు బుధవారం పచ్చని బట్టలు ధరించడం వల్ల బుధ గ్రహం శుభ ఫలితాలను ఇస్తాడు. అయితే బుధవారం కొన్ని పనులు చేయడం వల్ల వ్యక్తి జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బుధవారం నాడు చేయకూడని పనుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
తల్లి-చెల్లి సహా ఏ స్త్రీలనైనా అవమానం చేయకండి.. బుధవారం నాడు తల్లి-చెల్లెలు, కుమార్తె వంటి స్త్రీలను ఎప్పుడూ అవమానించకండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో బుధ గ్రహం బలపడుతుంది. మీ మేధో సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు మేధో నైపుణ్యంతో ఎటువంటి పనులనైనా సులభంగా చేయగలుగుతారు. అంతేకాదు తల్లి, సోదరి వంటి మహిళలకు ఆకుపచ్చ బట్టలు లేదా గాజులను దానం చేయడం వలన శుభఫలితాలు అందుకుంటారు.
వీరిని అవమానించకండి, అసలు ఎప్పుడైనా హిజ్రాలను అవమానించరాదు. ముఖ్యంగా బుధవారం నపుంసకులని అవమానించకూడదు. అంతేకాదు ఈ రోజున వీరి ఆశీస్సులు తీసుకోవాలి. చేపట్టిన పనిని సక్సెస్ అవుతుంది. బుధవారం దానం చేయడం వలన శుభఫలితాలు పొందుతారు.
అప్పులు చేయవద్దు బుధవారం ఆర్థిక విషయాలలో రుణ లావాదేవీలు చేయడం శ్రేయస్కరం కాదు. అప్పు ముప్పు అన్న విషయాన్ని రుజువు చేస్తూ ఆర్థిక విషయాల్లో ప్రతికూల ప్రభావం చూపుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు లేదా ఈ రోజు తీసుకున్న డబ్బు ప్రయోజనం జరగదు. ఈ రోజు తీసుకున్న రుణం ఆర్థిక నష్టానికి దారి తీస్తుంది. అందుకే బుధవారం అప్పు తీసుకోకండి.
చెడు మాటలకు దూరంగా ఉండండి.. బుధుడు ప్రసంగం, కమ్యూనికేషన్ కారకం. బుధవారం చెడు పదాలను ఉపయోగించడం వల్ల బుధ గ్రహం బలహీనపడుతుంది. అందుకే ఈ రోజు ఎవరూ చెడు మాటలు మాట్లాడరాదు. ఇలా చేయడం వల్ల జీవితంలోని ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇంట్లో సంపద, శ్రేయస్సు లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).