AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monday Puja Tips: ఇంట్లో సుఖ, సంపదల కోసం సోమవారం శివయ్యను ఇలా పూజించండి.. ఈ మంత్రం పఠిస్తే అత్యంత ఫలవంతం

సోమవారం కొన్ని నియమాలను పాటిస్తూ పూజిస్తే.. ఖచ్చితంగా భక్తుల ఇంట సుఖ సంతోషాలతో పాటు సంపదను అనుగ్రహిస్తాడు.  ఈ నేపథ్యంలో శివయ్య ను సోమవారం ఆరాధించే సమయంలో ఈ ఐదు విషయాలను గుర్తు పెట్టుకోండి. అప్పుడు సదా తన భక్తులపై భోళాశంకరుడు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.   

Monday Puja Tips: ఇంట్లో సుఖ, సంపదల కోసం సోమవారం శివయ్యను ఇలా పూజించండి.. ఈ మంత్రం పఠిస్తే అత్యంత ఫలవంతం
Lord Shiva Puja
Surya Kala
|

Updated on: Jun 12, 2023 | 7:40 AM

Share

సనాతన హిందూ ధర్మంలో సోమవారం లయకారుడు శివుడికి అంకితం చేయబడింది. కనుక సోమవారం రోజున శివుడిని స్మరించుకుంటూ శివ శివ అన్నా అత్యంత ఫలవంతం అని పెద్దల విశ్వాసం. సృష్టి లయకారుడైన శివయ్యను భక్తితో స్మరిస్తే చాలు కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు. అదే సమయంలో, అతను చిన్న విషయాలకు తీవ్ర కోపంతో పరిస్థితిని తారుమారు చేస్తాడని నమ్మకం. అటువంటి పరిస్థితిలో, మీరు సోమవారం కొన్ని నియమాలను పాటిస్తూ పూజిస్తే.. ఖచ్చితంగా భక్తుల ఇంట సుఖ సంతోషాలతో పాటు సంపదను అనుగ్రహిస్తాడు.  ఈ నేపథ్యంలో శివయ్య ను సోమవారం ఆరాధించే సమయంలో ఈ ఐదు విషయాలను గుర్తు పెట్టుకోండి. అప్పుడు సదా తన భక్తులపై భోళాశంకరుడు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.

  1. సోమవారం రోజున శివునికి ఉపవాసం ఉండటం అత్యంత ఫలవంతం.
  2. వివాహిత స్త్రీలు సోమవారం పసుపు, కుంకుమ, గాజులు వంటి వస్తువులను దానం చేస్తే అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు. పురుషులు, మహిళలు సోమవారం శివాలయంలో శివయ్యను దర్శించుకుని పేదలకు అన్నదానం చేయడం అత్యంత శుభప్రదం.
  3. సోమవారం శంకరుడిని పూజించేటప్పుడు నీరు , పాలతో అభిషేకం చేయండి, బిల్వ పాత్రలను సమర్పించండి.
  4. శివునికి నువ్వులు సమర్పించడం వల్ల పాపాలు నశిస్తాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. సోమవారం గౌరీశంకరుడిని కలిసి పూజించండి. శివాలయంలో రుద్రాక్షను సమర్పించండి. భక్తులు చాలా సంతోషిస్తాడు.

శివయ్యకు ప్రీతికరమైన మంత్రాలు 

సోమవారం నాడు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇది బాధలు, పేదరికం, సంక్షోభాలను తొలగిస్తుంది.

మహా మృత్యుంజయ మంత్రం:

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

అదేవిధంగా శివుని మూల మంత్రం కూడా అత్యంత ఫలవంతం. మనిషికి ఏర్పడే కష్టనష్టాల నుంచి విముక్తి లభిస్తుంది.

శివుని మూల మంత్రం..  ఓం నమః శివాయ అంటూ చేసే జపం ప్రయోజనకరంగా ఉంటుంది

అంతేకాకుండా రుద్ర గాయత్రీ మంత్రాన్ని పఠించడం కూడా శివునికి ఎంతో ప్రీతికరమైనది.

రుద్ర గాయత్రీ మంత్రం: ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).