Beautiful Temples: మన దేశంలో ఈ ఆలయాల అందాన్ని చూడాలంటే రెండు కళ్ళు చాలవేమో.. అలనాటి శిల్పకళా వైభవానికి గుర్తు..

భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. ఆసేతు హిమాచలంలో అనేక దేవాలయాలున్నాయి. ఒక్క ఒడిశా రాష్ట్రంలోనే 700 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రాన్ని టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. భారతదేశంలో అందమైన, రహస్య దేవాలయాల గురించి తెలుసుకుందాం.. 

Surya Kala

|

Updated on: Jun 12, 2023 | 12:37 PM

ఖజురహో దేవాలయాలు: మధ్యప్రదేశ్‌లోని ఖజురహో దేవాలయాలు అందాలకు ప్రసిద్ధి. ఈ దేవాలయాలు 900 AD నుండి 1130 AD మధ్య నిర్మించబడ్డాయి. ఖజురహో ఆలయాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు.

1 / 5
తీర దేవాలయం: తమిళనాడులోని షోర్ టెంపుల్ కాంప్లెక్స్‌లో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ నుండి  బంగాళాఖాతాన్ని చూడవచ్చు. ఇక్కడ దేవాలయాలు 8వ శతాబ్దంలో నిర్మించబడ్డాయని చారిత్రక కథనం. 

2 / 5
మీనాక్షి అమ్మవారి ఆలయం: తమిళనాడులోని ఈ ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం మధురైలో ఉంది. పంచ శక్తి పీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైంది. ఈ ఆలయాన్ని చూడగానే అందం కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్లేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.

3 / 5
కేదార్‌నాథ్: కేదార్‌నాథ్‌ను సందర్శించడానికి భారతదేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా ప్రజలు వస్తుంటారు. శివుని 12 జ్యోతిర్లింగాల క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ మంచుతో కప్పబడిన హిమాలయాలు.. మంచు దుప్పటి కప్పుకున్న అందమైన పర్వతాలను చూడటం ఒక భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. 

4 / 5
శ్రీరంగం ఆలయం: తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీరంగంలో ఉన్న శ్రీరంగం ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. విష్ణువుకి చెందిన ప్రముఖ ఆలయం. ఈ ఆలయం విజయనగర కాలంలో (1336–1565) నిర్మించబడింది.

5 / 5
Follow us