Birds Vastu Tips: ఈ పక్షులు మీ ఇంటికి వస్తే లక్ష్మిప్రదం.. అదృష్టం తిష్ట వేస్తుంది..!

వాస్తు శాస్త్ర పరిష్కారాలను అనుసరిస్తారు. వాస్తు శాస్త్రం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడానికి, నెగటివ్ ఎనర్జీని తొలగించడానికి సహాయపడుతుంది. అలాంటిదే పవిత్రంగా భావించే కొన్ని పక్షులు కూడా మీ అదృష్టాన్ని ప్రకాశింపజేసే సంకేతాలను అందిస్తాయని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్న మాట. అదృష్టానిచ్చే అలాంటి పక్షులు ఏవో ఇక్కడ తెలుసుకుందాం..

Birds Vastu Tips: ఈ పక్షులు మీ ఇంటికి వస్తే లక్ష్మిప్రదం.. అదృష్టం తిష్ట వేస్తుంది..!
Birds Vastu
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 15, 2023 | 10:06 AM

హిందూ మతంలో, దేవతలతో పాటు, భూమి-ఆకాశం, చెట్లు-మొక్కలు, (పశువులు) జంతువులు, పక్షులను కూడా పూజిస్తారు. నేటి కాలంలో ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఆనందం, సంపద, మానసిక ప్రశాంతత ఉండాలని కోరుకుంటాడు. దీని కోసం ప్రజలు పూజాదికార్యక్రమాలు, జ్యోతిష్య పరిష్కారాలు చేస్తుంటారు. వాస్తు శాస్త్ర పరిష్కారాలను అనుసరిస్తారు. వాస్తు శాస్త్రం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడానికి, నెగటివ్ ఎనర్జీని తొలగించడానికి సహాయపడుతుంది. అలాంటిదే పవిత్రంగా భావించే కొన్ని పక్షులు కూడా మీ అదృష్టాన్ని ప్రకాశింపజేసే సంకేతాలను అందిస్తాయని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్న మాట. అదృష్టానిచ్చే అలాంటి పక్షులు ఏవో ఇక్కడ తెలుసుకుందాం..

పాలపిట్ట:

వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ పక్షులు మన ఇంటికి రావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. నీలకంఠ పక్షి దీనినే పాలపిట్ట అంటారు. ప్రత్యేకంగా దసరా రోజున దీనిని చూస్తే మీ అదృష్టం పెరుగుతుంది.

గుడ్లగూబ:

సాధారణంగా గుడ్లగూబను మహాలక్షికి వాహనంగా పరిగణిస్తారు. కాబట్టి మీరు మీ ఇల్లు, దుకాణం లేదా మరేదైనా ఆస్తికి సమీపంలో గుడ్లగూబను చూసినట్లయితే, మీకు ఏదైనా మంచి జరగబోతోందనడానికి సంకేతం.

ఇవి కూడా చదవండి

చిలుక:

వాస్తు శాస్త్ర పండితుల ప్రకారం, అనుకోకుండా మీ ఇంటికి చిలుక వచ్చి కొంత సేపు కూర్చుంటే, మీకు ఎక్కడి నుండైనా అనుకోకుండా డబ్బు వస్తుందనడానికి సంకేతం.

ఇంట్లో పక్షి గూడు:

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకుంటే, ఇంట్లో త్వరలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుందనడానికి సంకేతం.

కాకి:

కాకి ఇంటికి అతిథుల రాకను సూచిస్తుంది. కొంతమంది జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, ఇంట్లోకి కాకులు రావడం కూడా శుభప్రదంగా భావిస్తారు.

కోడి:

గ్రామాల్లో నివసించే పెద్దలు చెప్పిన మాటల ప్రకారం.. వాస్తు శాస్త్రం ప్రకారం, కోడి కూత విన్నట్లయితే, అరుపులు విన్నట్లయితే, మీరు మీ పాత స్నేహితులు, పాత సహోద్యోగులను త్వరలో కలుస్తారనడానికి సంకేతం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).