AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీటలపై ఆగిన పెళ్లి.. !..ప్రియురాలి ఫిర్యాదుతో వరుడి తిక్క కుదిర్చిన పోలీసులు..

పెళ్లి మూహూర్తం వచ్చేసింది. మరికొద్ది గంటల్లో పెళ్లి కూతురి మెడలో వరుడు తాళికట్టాల్సి ఉంది. అయితే, అంతలోనే ఎవరూ ఊహించని విధంగా పీటలపై పెళ్లి ఆగిపోయింది. పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. ఈఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

పీటలపై ఆగిన పెళ్లి.. !..ప్రియురాలి ఫిర్యాదుతో వరుడి తిక్క కుదిర్చిన పోలీసులు..
Bride Cancels Wedding
Jyothi Gadda
|

Updated on: Jun 15, 2023 | 7:52 AM

Share

పెళ్లి మూహూర్తం వచ్చేసింది. మరికొద్ది గంటల్లో పెళ్లి కూతురి మెడలో వరుడు తాళికట్టాల్సి ఉంది. అయితే, అంతలోనే ఎవరూ ఊహించని విధంగా పీటలపై పెళ్లి ఆగిపోయింది. ప్రేమించిన యువతిని కాదని, మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డ వరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇప్పటి హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో చోటు చేసుకుంది. కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లికి చెందిన ఓ యువతి స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీ డియెట్‌లో చేరింది. అప్పట్నుంచి కౌటాల మండలం బొందపల్లికి చెందిన యువకుడు ఏటకారి సాయితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతడు ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దాంతో యువతి కూడా అతని మాటలు నమ్మింది. అతనితో ప్రేమలో పడింది.

అలా వీరి మధ్య ప్రేమ కారణంగా 2020లో సదరు యువతి గర్భం దాల్చింది. ఆ తర్వాత సాయి ఆమెకు అబార్షన్‌ చేయించాడు. చివరకు వీరి ప్రేమ వ్యవహారం ఇరువురి ఇళ్లల్లో తెలిసింది. ఆ తర్వాత సాయి ఆమెను మెల్లి మెల్లిగా దూరం పెట్టడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తూ దూరంగా ఉంటున్నాడు. ఈక్రమంలో గత నెల 28న ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి నమ్మించి కౌటాలలోని తన గదికి తీసుకెళ్లి ఆమె మెడలో పసుపు తాడు కట్టాడు. లైంగిక వాంఛ తీర్చుకున్నాడం బాధితురాలు ఫిర్యాదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు.. ఆ తర్వాతి రోజు నుంచి సాయి ఆమెకు దూరంగా ఉంటున్నాడు. దీంతో ఆయువతి ఈనెల 12న పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో సాయి కమలాపూర్‌ మండలంలోని ఉప్పల్‌కు చెందిన ఓ యువతితో వివాహ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈనెల 14న వీరిద్దరి పెళ్లి జరగాల్సి ఉండగా.. అక్కడి పోలీసులు కమలాపూర్‌ పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఉప్పల్‌కు చేరుకున్నారు.

మరికొన్ని నిమిషాల్లో పెళ్లి జరుగుతుందనగా, ఎదుర్కోళ్ల సమయంలో పోలీసులను గమనించిన సాయి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కమలాపూర్‌ ఇన్‌చార్జ్‌ సీఐ శ్రీనివాస్‌ అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి పెళ్లిని ఆపేశారు. స్థానికులు, బంధువుల సాయంతో పోలీసులు సాయిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.