Telangana: రుతుపవనాల రాక ఆలస్యం.. ఆ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు
తెలంగాణలో రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.
తెలంగాణలో రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఖమ్మం, ములుగు, కుమురంభీం, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్లొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యపేట, భూపాపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయి. బుధవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా కరీంనగర్ జిల్లా తంగులలో 45.4 డిగ్రీ సెల్సీయస్‌గా రికార్డైంది. అలాగే ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఖమ్మంలో 42.2 డిగ్రీ సెల్సీయస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. మెదక్‌లో 25.2 డిగ్రీ సెల్సీయస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.