Minister Satyavathi Rathod: తాత్కాలికంగా విశ్రాంతి తీసుకోండి.. మంత్రి సత్యవతి రాథోడ్‌కు వైద్యుల సలహా.. కారణం ఏంటో తెలుసా..

సత్యవతి రాథోడ్ తాత్కాలికంగా విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్న వైద్యులు. గత 9 నెలల నుంచి పాదరక్షలు వదిలేసి సంకల్పదీక్ష చేస్తున్నారు సత్యవతి రాథోడ్. సీఎం కేసీఆర్ కోసం ఇంతకన్నా ఏమిచ్చి తాను రుణం తీర్చుకోగలనని..

Minister Satyavathi Rathod: తాత్కాలికంగా విశ్రాంతి తీసుకోండి.. మంత్రి సత్యవతి రాథోడ్‌కు వైద్యుల సలహా.. కారణం ఏంటో తెలుసా..
Minister Satyavathi Rathod
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 15, 2023 | 5:08 PM

బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవరకూ కాళ్లకు చెప్పులు ధరించబోనని సంకల్ప దీక్ష చేపట్టిన గిరిజన, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అరికాళ్లకు బొబ్బలు వచ్చాయి. దీంతో సత్యవతి రాథోడ్ తాత్కాలికంగా విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్న వైద్యులు. గత 9 నెలల నుంచి పాదరక్షలు వదిలేసి సంకల్పదీక్ష చేస్తున్నారు సత్యవతి రాథోడ్. సీఎం కేసీఆర్ కోసం ఇంతకన్నా ఏమిచ్చి తాను రుణం తీర్చుకోగలనని భావోద్వేగానికి లోనవుతున్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

నియోజకవర్గంలో ఎక్కడ కార్యక్రమాలు జరిగినా ఆమె చెప్పులు లేకుండానే పాల్గొంటున్నారు. అవిశ్రాంతంగా వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఓ వైపు పార్టీ కార్యక్రమాలు.. మరోవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనికితోడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం.. చెప్పులు లేకుండానే నడిచిరావడంతో ఆమె కాళ్లకు బొబ్బలు వచ్చాయి.

తాజాగా ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్ సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఎండలో పాదరక్షలు లేకుండానే నడిచారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం