Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponguleti Srinivasa Reddy: పొంగులేటిపై సీనియర్ నేతల అసహనం.. చేరిక వాయిదా పడుతూనే ఉందంటూ..!

Telangana: బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి ఇంతకీ ఏ పార్టీ లో చేరబోతున్నారు...? గతంలో బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్నారనే లీకు లపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం అవుతుందా..? పొంగులేటి నాన్చుడు ధోరణి పై ఆ నేతల ఆగ్రహం ఎందుకు..? పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాల పేరుతొ తన వర్గానికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు...?పొంగులేటి చేరికపై ఆ జిల్లా కాంగ్రెస్ నేతల మదిలో ఏముంది..?

Ponguleti Srinivasa Reddy: పొంగులేటిపై సీనియర్ నేతల అసహనం.. చేరిక వాయిదా పడుతూనే ఉందంటూ..!
Ponguleti Srinivasa Reddy
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 15, 2023 | 5:45 AM

Ponguleti Srinivasa Reddy: తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా పొంగులేటి హాట్ టాపిక్ గా మారరు.. బిఆరెస్ నుండి బహిష్కరణ తరువాత పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తున్నరు.. ఏ పార్టీలోకి వెళ్తే లాభం.. ఆయన వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు అని అన్ని పార్టీలు బేరిజు వేసుకోవడంతో పాటు వారిని పార్టీలోకి ఆహ్వానించడానికి కూడా అన్ని పార్టీలు ముందున్నాయి.. ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనే జరుగుతుంది.. అయితే ప్రస్తుతం పొంగులేటి ఏ పార్టీ లో చేరుతున్నారనే సాగదిత ధోరణి మొదటికే మోసం వచ్చేలా కనిపిస్తుంది.. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనలు నిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు.. ఏ పార్టీలో చేరాలి కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనే దానిపై కూడా తీవ్రంగా మంతనాలే జరిగాయి.

మరోవైపు పొంగులేటి మొదట్లో బీజేపీ లోనే చేరుతున్నారనే వార్తలు వినిపించాయి. బీజేపీ నేత ఈటెల సైతం పలుమార్లు పొంగులేటి తో భేటీ కావడంతో ఇక బీజేపీలోకే ఫైనల్ అనుకున్నారు.. అనంతరం బిఆరెస్ అసమ్మతి నేతలు, తెలంగాణ ఉద్యమకారులతో పొంగులేటి భేటీ అయి కొత్త పార్టీపైన కూడా చర్చ జరిగింది.. ఇక కర్ణాటక ఫలితాల వరకు వేచి చూసిన పొంగులేటి అక్కడ కాంగ్రెస్ భారీ మెజారిటీ తో గెలిచిన తరువాత తన చూపు కాంగ్రెస్ వైపు పడింది.. పలుమార్లు కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ టీం తో కూడ మంతనాలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడమే తరువాయి అని, మీడియా సమావేశం ఉండబోతుందని అనుకునే లోపే వాయిదా పడుతూ వస్తుందని ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు పొంగులేటి‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా పొంగులేటి నాన్చుడు ధోరణిపై ఖమ్మం కాంగ్రెస్ నేతల అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. రేణుక చౌదరి, వి.హనుమానంతరావు లాంటి వారు బహిరంగగానే విమర్శలు చేస్తున్నారు.. పార్టీ లో చేరితే చేరాలి కానీ ఇంత హైప్ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.. గతంలో పొంగులేటి లేకున్నా ఖమ్మం లొ 8 సీట్లు గెలిచిన ఘనత కాంగ్రెస్ ది అని.. తాము ఇప్పుడు కష్టపడ్డ ఖమ్మం క్లీన్ స్విప్ చేస్తామని ఖమ్మం నేతలు గుసగుసలాడుతున్నారాట.. పొంగులేటి అంత గొప్ప లిడర్ అయితే బిఆరెస్ ని ఎందుకు గెలిపించుకోలేకపోయాడని ఆ జిల్లా నేతలు గాంధీ భవన లో తమ బాధ చెప్పుకుంటున్నారట. కర్ణాటక గెలుపుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్.. పొంగులేటి చేరికతో జోష్ వస్తుంది అనుకుంటే.. ఆయన నాన్చుడు ధోరణి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది..

ఇవి కూడా చదవండి

-ఆశోక్, TV9 Reporter, Telangana

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.