Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Basara IIIT Campus: దీపిక మృతికి కారణాలు చెప్పాలంటూ విద్యార్థుల ఆందోళన.. త్రిసభ్య కమిటీలో లోపాలున్నాయంటూ..

Basara IIIT Campus: అనేక వివాదాలతో సతమతమవుతున్న బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. దీపిక మృతికి కారణాలు తెలపాలని డిమాండ్‌ చేస్తూ.. విద్యార్థులు మళ్లీ ఆందోళన చేపపట్టారు. దీపిక ఆత్మహత్యపై కాలేజీ సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం సభ ఏర్పాటు చేశారు.

Basara IIIT Campus: దీపిక మృతికి కారణాలు చెప్పాలంటూ విద్యార్థుల ఆందోళన.. త్రిసభ్య కమిటీలో లోపాలున్నాయంటూ..
Basara IIIT Students pretesting(File pic)
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 15, 2023 | 5:15 AM

Basara IIIT Campus: బాసర ట్రిపుల్‌ ఐటీ మళ్లీ ట్రబుల్‌ ఐటీగా మారుతోంది. ఫస్టియర్‌ పీయూసీ చదువుతున్న దీపిక అనేక విద్యార్థిని కాలేజీ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకోవడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు మళ్లీ ఆందోళన చేపట్టారు. పరీక్షల పేరిట తీవ్ర ఒత్తిడికి గురి చేసి.. ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ ఎదుట విద్యార్థుల నిరసనకు దిగారు. లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. డైరక్టర్ ఛాంబర్‌కి విద్యార్థులను అనునతించక పోవడంతో పరిపాలన భవనం ముందుకు కూర్చుని నిరసన తెలిపారు. దీపిక మృతికి కారణాలు తెలపాలని డిమాండ్‌ చేశారు. చీఫ్ వార్డెన్ కె. మధుసూదన్, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ దత్తు, అసోసియేట్ డీన్ డాక్టర్ పావని, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ బి వినోద్‌తో ఏర్పాటు చేసిన విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదని విద్యార్థులు తెలిపారు. త్రిసభ్య కమిటీలోనే లోపం ఉందని విమర్శిస్తున్నారు.

మరోవైపు దీపిక చనిపోయిన ఏబీ3 బ్లాక్‌లోకి విద్యార్థులను అనుమతించకపోవడంతో పలు అనుమానాలు‌ వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. దీపిక సూసైడ్‌ లెటర్‌ రాసి ఉంటుందని చెబుతున్నారు. రక్షించే వారే భక్షించే వారిగా మారారంటూ సీనియర్‌ విద్యార్థులు. ఆరోపిస్తున్నారు. మరోవైపు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతి పట్ల అదికారుల సంతాపం తెలిపారు. క్యాంపస్ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సంతాప సభ ఏర్పాటు చేశారు. వీసీ వెంకటరమణ , డైరెక్టర్ ప్రొపెసర్ సతీష్ కుమార్‌తోపాటు అధ్యాపకులు వర్చువల్‌గా పాల్గొన్నారు. సంతాప సభ అనంతరం దీపిక కుటుంబానికి‌ లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు వీసీ వెంకటరమణ. అనేక వివాదాలతో సతమతమవుతున్నబాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. దీపిక ఆత్మహత్యపై విద్యార్థులు, కాలేజీ సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

కాగా, బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ- ఫస్ట్ ఇయర్ చదువుతున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన దీపిక.. రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బాత్రూంకు వెళ్లి తిరిగి ఎంత సేపైనా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి తోటి స్నేహితులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్లు డోర్లు బద్ధలు కొట్టి చూసేసరికి ఆమె చున్నీతో ఉరేసుకుని అపస్మారక స్థితిలో కనిపించింది. తొలుత క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అందించి.. అనంతరం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలిచారు. కాని, అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.