Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Fraud: మనీ లాండరింగ్ కేసులో డీసీ మాజీ ఛైర్మెన్‌కి ఊరట.. చాలా కాలం తర్వాత వెంకట్రాం రెడ్డి అరెస్ట్ తగదంటూ..

Bank Fraud Case: డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి కేసులో హై డ్రామా చోటుచేసుకుంది. సిబిఐ ఎఫైర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడి ఆధికారులు వెంకటరామిరెడ్డితో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసింది. అయితే 41 సిఆర్పిసి నోటిస్ తో పాటు సిబి ఐ కేస్ చేసిన చాలా కాలం తర్వాత ఈడి అరెస్ట్ చేయడాన్ని కోర్ట్ తప్పుబట్టింది..వెంకట్ రామ్ రెడ్డి రిమాండ్ రిజెక్ట్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది ఈడి కోర్ట్.

Bank Fraud: మనీ లాండరింగ్ కేసులో డీసీ మాజీ ఛైర్మెన్‌కి ఊరట.. చాలా కాలం తర్వాత వెంకట్రాం రెడ్డి అరెస్ట్  తగదంటూ..
Deccan Chronicle’s Former Chairman T Venkattram Reddy
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 15, 2023 | 5:25 AM

Bank Fraud Case: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కేసులో వెంకటరామిరెడ్డికి స్వల్ప ఊరట లభించింది. మనీలాండరింగ్ అభియోగాలతో ఆరెస్ట్ అయిన ఆయన్ను ఆరెస్ట్ చేయడాన్ని కోర్ట్ తప్పుబట్టింది. అలాగే ఈడీ ఆధికారులు కోరిన రిమాండ్‌ని రిజెక్ట్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది సదరు ఈ కోర్ట్. అయితే అంతకముందు 16 బ్యాంకుల నుండి దాదాపు 8 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుని ఎగివేసిన కేసులో మనీలాండరింగ్ అభియోగాలు రావడంతో వెంకటరామిరెడ్డితో పాటు మరో ఇద్దరిని ఈడి అరెస్ట్ చేసింది. 2015లో సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగింది ఈడి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను అప్పటికే ఉన్న అప్పులు చెల్లించేందుకు ఉపయోగించడంతో పాటు, తీసుకున్న రుణాలు సైతం తప్పుడు పత్రాలతో తీసుకున్నట్టు దర్యాప్తులో బయటపడింది. ఇదే వ్యవహారంపై 2015లో వెంకట్రాంరెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. ఇదే సిబిఐ ఎఫ్ఐఆర్ను ఆధారంగా తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ అధికారులు మనీలాండరింగ్ పైన దర్యాప్తు చేపట్టారు.

విచారణలో భాగంగా మంగళవారం ఉదయం వెంకటరామిరెడ్డి తో పాటు దక్కన్ క్రానికల్ ప్రమోటర్లు అయ్యర్ ,ఆడిటర్ మనీ ఓమెన్ ఈడి కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరయ్యారు.. దర్యాప్తులో మనీలాండరింగ్ జరిగినట్టు ఆధారాలు లభించడంతో మంగళవారం రాత్రి ముగ్గురిని అదుపులోకి తీసుకుంది ఈడి. బుధవారం ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన అనంతరం నాంపల్లిలోని ఈడి కోర్టులో వెంకటరామిరెడ్డి తోపాటు ఇద్దరిని హాజరు పరిచారు అధికారులు.. సిబిఐ నమోదు చేసిన చాలా సంవత్సరాల తర్వాత ఈ డి తమ క్లైంట్ ను అరెస్టు చేసిందంటూ వెంకటరామిరెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. దీంతోపాటు అరెస్టు సమయంలో పాటించాల్సిన 41 ఏ విధానాన్ని అధికారులు పాటించలేదని ఆయన వాదించారు. ఈడీ కేసు నమోదు చేసినప్పటి నుండి ప్రతి సారీ విచారణకు వెంకటరామిరెడ్డి సహకరిస్తున్నారని తెలిపారు. విచారణకు సహకరిస్తున్నప్పటికీ ఈడి తప్పుడు అభియోగాలు చూపి అరెస్టు చేసిందని డీసీ చైర్మన్ తరపు న్యాయవాది కోర్ట్ లో వాదించారు.

వెంకటరామిరెడ్డి రిమాండ్కు ముందు ఈడి అధికారులు అతని అరెస్టుపై ప్రకటన విడుదల చేశారు. డక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ పేరుతో పలు బ్యాంకుల నుండి రుణాలు పొందేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్టు ఈడి స్పష్టం చేసింది బ్యాంకుల నుండి రుణాలు పొందేందుకు కంపెనీకి చెందిన బాలన్స్ షీట్స్ లో అంకెలు తారుమారు చేసారని ఈడి తెలిపింది. అప్పటికే ఉన్న అప్పులు తీర్చుకునేందుకు బ్యాంకుల నుండి రుణాలు పొందటంతో పాటు బ్యాంకు ల నుండి వచ్చిన రుణాలను ఐపీఎల్ లోను పెట్టుబడి పెట్టినట్టు ఈడి దర్యాప్తులో వెల్లడైంది.. వీటి ద్వారా అధిక లాభాలను చూపి ప్రమోటర్ల ఖాతాలోకి 143 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. పలు బ్యాంకుల నుండి రుణాలు పొందేందుకు డక్కన్ క్రానికల్ కు చెందిన యాడ్ రెవెన్యూ సైతం తారుమారు చేసి చూపించినట్టు అధికారులు గుర్తించారు. ఒక బ్యాంకు నుండి లోన్ పొందే సమయంలో మరో బ్యాంక్ ఇచ్చిన రుణాలు హైడ్ చేశారని ఈడి తెలిపింది .. వచ్చిన రుణాలతో ఒక ప్రైవేటు చార్టెడ్ ఫ్లైట్ ను వెంకట్రాంరెడ్డి కొనుగోలు చేసినట్టు ఈడి దర్యాప్తులో బయటపడింది. దీంతోపాటు లగ్జరీ కార్ల సముదాయo కోసం 30 కోట్లు డెక్కన్ క్రానికల్ ప్రమోటర్ అయ్యర్ ఖర్చు చేసినట్టు ఈడి ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

వెంకటరామిరెడ్డి తో పాటు డిసి ప్రమోటర్ అయ్యర్, డిసీ ఆడిటర్ వోమెన్ లను నాంపల్లి ఈడీ కోర్టులో హాజరు పరిచిన అనంతరం వీరి రిమాండ్ పై కోర్ట్ అభ్యంతరం తెలిపింది. ఎప్పుడో సిబిఐ నమోదు చేసిన కేసులో ఇప్పుడు అరెస్టు చేయడం ఏంటని ఈడీని ప్రశ్నించింది కోర్ట్. దీంతోపాటు అరెస్టు సమయంలో 41 ప్రొసీజర్ ను ఈడి ఫాలో కాలేదని ఆరోపిస్తూ రిమాండ్ రిజెక్ట్ చేసింది ఈ డి కోర్ట్. లక్ష రూపాయలతో రెండు షూరిటీలను సమర్పించాల్సిందిగా ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది ఈ డి కోర్ట్.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..