Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఓర్నీ అత్యుత్సాహం తగలెయ్యా..! తుఫాన్‌ గురించి చెప్తూ సముద్రంలో దూకిన రిపోర్టర్.. వైరల్ అవుతున్న వీడియో..

Cyclone Biparjoy: ఇప్పటికే తీర ప్రాంతాలను వణికిస్తున్న బిపార్జోయ్ తుఫాను జూన్ 15న గుజరాత్‌లోని కచ్‌ను తాకనుంది. మరోవైపు దాని ప్రభావం  ఇప్పటికే పలు ప్రాంతాలలో కనిపించడం ప్రారంభమయింది. ముంబై నుంచి కేరళ తీరం వరకు సముద్రంలో ఈదురు గాలులు..

Watch Video: ఓర్నీ అత్యుత్సాహం తగలెయ్యా..! తుఫాన్‌ గురించి చెప్తూ సముద్రంలో దూకిన రిపోర్టర్.. వైరల్ అవుతున్న వీడియో..
Pakistani News Reporter
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 15, 2023 | 7:40 AM

Cyclone Biparjoy: ఇప్పటికే తీర ప్రాంతాలను వణికిస్తున్న బిపార్జోయ్ తుఫాను జూన్ 15న గుజరాత్‌లోని కచ్‌ను తాకనుంది. మరోవైపు దాని ప్రభావం  ఇప్పటికే పలు ప్రాంతాలలో కనిపించడం ప్రారంభమయింది. ముంబై నుంచి కేరళ తీరం వరకు సముద్రంలో ఈదురు గాలులు ఎగసిపడుతున్నాయి. ఈ మేరకు గుజరాత్‌లో ఐఎండీ భారీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ తుఫాను వల్ల భారత్‌కు ఎంత ప్రమాదం ఉందో పాకిస్థాన్‌కు కూడా అంతే ప్రమాదం. పాకిస్తాన్‌లో కూడా ఈ తుఫాను చూసి, సింధ్ ప్రావిన్స్‌లోని లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అక్కడి అధికారులు. అయితే వీటన్నింటి మధ్యలో పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో తుఫాను గురించి అతను ఎంతో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఫన్నీగా రిపోర్టు చేస్తూ కనిపించాడు.

వైరల్ అవుతున్న వీడియోలో స్థానిక ఛానెల్‌కు చెందిన ఒక జర్నలిస్ట్ బిపార్జోయ్‌ తుఫాన్ గురించి రిపోర్టింగ్ చేస్తున్నాడు. పాకిస్థాన్‌కి సముద్ర తీరప్రాంతమైన కరాచి వద్ద అతను బిపార్జోయ్ గురించి నివేదిస్తూ ఆ దేశ పరిస్థితిని వివరించాడు. పాకిస్థాన్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతారనే విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా తన రిపోర్టింగ్‌తో వివరించాడు. తుఫాను కారణంగా పడవలు ఎలా ఒడ్డుకు చేరాయో కెమెరా మెన్ మీకు చూపిస్తారని కూడా అతను తన రిపోర్టింగ్‌లో కూడా జరిగింది. అంతేనా.. నీళ్లలోకి దూకి అక్కడ నుంచే మైక్‌తో మాట్లాడాడు.

ఇవి కూడా చదవండి

కాగా, వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ప్రజలేమో ముందు సదరు రిపోర్టర్ చనిపోయేలా ఉన్నాడని, ఇలాంటి రిపోర్టర్లు మనకు కూడా కావాలని, జర్నిలిస్ట్ ప్రో అని పలువురు నెటిజన్లు రాసుకొస్తున్నారు. ఇంకా ఫన్నీ ఎమోజీలతో రిపోర్టర్‌పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు వేల సంఖ్యలో వీక్షణలు లభించాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి :