103 మందిని మింగేసిన పడవ ప్రయాణం.. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం..

నదిలో గల్లంతైన వారిలో ఎక్కువ మంది ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నట్టుగా తెలిసింది. వీరంతా వివిధ గ్రామాలకు చెందిన బంధువులు, స్థానికులుగా గుర్తించారు. వీరంతా పెళ్లికి వెళ్లేందుకు బైక్‌పై వచ్చారు. అయితే, భారీ వర్షం కారణంగా రోడ్డుపై వరద నీరు ప్రవహించడంతో వారంతా పడవలో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.

103 మందిని మింగేసిన పడవ ప్రయాణం.. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం..
Niger River
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 15, 2023 | 7:01 AM

నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పడవ బోల్తా పడడంతో 103 మంది చనిపోయారు. ఇందులో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పడవ నిండా జనాలతో చాలా రద్దీగా ఉన్న పడవ సరిగ్గా రెండుగా చీలిపోయింది. బోటులో దాదాపు 300 మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర రాజధాని ఇలోరిన్‌కు 160 కిలోమీటర్ల (100 మైళ్లు) దూరంలో క్వారా రాష్ట్రం పటేగి జిల్లాలోని నైజర్ నదిపై ఈ ప్రమాదం జరిగింది. జనంతో నిండిన పడవ బోల్తా పడటంతో స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 100 మందిని రక్షించినట్లు పోలీసు శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

నదిలో గల్లంతైన వారిలో ఎక్కువ మంది ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నట్టుగా తెలిసింది. వీరంతా వివిధ గ్రామాలకు చెందిన బంధువులు, స్థానికులుగా గుర్తించారు. వీరంతా పెళ్లికి వెళ్లేందుకు బైక్‌పై వచ్చారు. అయితే, భారీ వర్షం కారణంగా రోడ్డుపై వరద నీరు ప్రవహించడంతో వారంతా పడవలో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో పడవ రెండుగా చీలి బోల్తా పడింది.

బోటులో 300 మంది ఉండడంతో ఓవర్‌లోడ్‌ అయింది. పడవ ముందుకు కదులుతున్న సమయంలో అందులో పెద్ద పగుళ్లు వచ్చి రెండు భాగాలుగా విడిపోయిందని చెప్పారు. ఇక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.