Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14ఏళ్ల బాలుడిని సజీవంగా తినేసిన మొసలి.. ఆగ్రహంతో కుటుంబ సభ్యుల దాడి..

బాలుడి అరుపులు విని తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు అంకిత్‌ను రక్షించేందుకు ప్రయత్నించగా మొసలి దాడికి గురై మృతి చెందాడు. ఒక గంట తర్వాత, బాలుడి అవశేషాలను గంగా నది నుండి స్వాధీనం చేసుకున్నారు. అయితే కోపోద్రిక్తులైన స్థానికులు చేపలు పట్టే వలలతో మొసలిని పట్టుకుని ఒడ్డుకు చేర్చి

14ఏళ్ల బాలుడిని సజీవంగా తినేసిన మొసలి.. ఆగ్రహంతో కుటుంబ సభ్యుల దాడి..
Crocodile Attack
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 14, 2023 | 1:29 PM

గంగానదిలో స్నానం చేయడానికి వెళ్లిన 14ఏళ్ల బాలుడిని మొసలి తినేసింది. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు మొసలిని చేపల వలలో పట్టుకుని కొట్టి చిత్రహింసలు పెట్టి చంపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృతిచెందిన బాలుడు కుటుంబంతో కలిసి గంగనీళ్లు తీసుకురావడానికి నదికి వచ్చాడని తెలిసింది. ఈ షాకింగ్‌ ఘటన బీహార్ లోని పాట్నాలో వెలుగు చూసింది. నీళ్ల కోసం నదిలోకి దిగిన బాలుడిపై దాడి చేసిన మొసలి అతన్ని సజీవంగా నమిలి తిసేసింది. కళ్లముందే తమ కుమారుడు మొసలి బారిన పడటం చూసి తట్టుకోలేకపోయారు. బంధువులు, ఇతర గ్రామస్తుల సాయంతో చేపల వలవేసిన మొసలిని బంధించారు. కర్రలు, రాడ్‌లతో దారుణంగా కొట్టి చంపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బీహార్‌లోని వైశాలి జిల్లా రాఘోపూర్ దియారాకు చెందిన 5వ తరగతి విద్యార్థి అంకిత్ కుమార్ కుటుంబం కొత్త మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసింది. బండి పూజ సందర్భంగా గంగలో స్నానం చేయాలని నిర్ణయించుకున్నారు వారి కుటుంబ సభ్యులు. కొత్త వాహనం కొనుగోలు చేసిన ఆనందంలో వాహనానికి పూజ చేసేందుకు ఖల్సా ఘాట్‌కు వచ్చారు. ఈ సమయంలో చిన్న పిల్లవాడు గంగానది నుండి నీరు తీసుకురావడానికి దిగాడు. కొద్ది క్షణాల్లోనే నీళ్లలో దాగివున్న మొసలి ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. చూస్తుండగానే అతన్ని నీళ్లలోకి లాక్కెళ్లింది. ఆ తరువాత అతడిని సజీవంగానే.. ముక్కలుగా ముక్కలుగా కొరికి తినేసింది.

ఇవి కూడా చదవండి

బాలుడి అరుపులు విని తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు అంకిత్‌ను రక్షించేందుకు ప్రయత్నించగా మొసలి దాడికి గురై మృతి చెందాడు. ఒక గంట తర్వాత, బాలుడి అవశేషాలను గంగా నది నుండి స్వాధీనం చేసుకున్నారు. అయితే కోపోద్రిక్తులైన స్థానికులు చేపలు పట్టే వలలతో మొసలిని పట్టుకుని ఒడ్డుకు చేర్చి కర్రలు, రాడ్లతో దారుణంగా కొట్టి చంపారు. మొసలిని చిత్రహింసలకు గురిచేసి చంపిన దృశ్యాలు మొబైల్ ఫోన్‌లో బంధించగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి :