వారెవ్వా.. పెళ్లి కొడుకా మజాకా..! ఏకంగా 51 ట్రాక్టర్లతో ఊరేగింపుతో వచ్చిన వరుడు.. వీడియో చూస్తే వావ్‌ అనాల్సిందే..

వరుడి ఇంటికి 51 కిలోమీటర్ల దూరంలోని వధువు గ్రామానికి ఊరేగింపు బయలుదేరింది. 51 ట్రాక్టర్లలో 200 మందికి పైగా ఈ మహా ఊరేగింపులో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు క్యూలో ఉండడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వారెవ్వా.. పెళ్లి కొడుకా మజాకా..!  ఏకంగా 51 ట్రాక్టర్లతో ఊరేగింపుతో వచ్చిన వరుడు.. వీడియో చూస్తే వావ్‌ అనాల్సిందే..
Groom Drives
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 14, 2023 | 12:14 PM

ఒకప్పుడు పెళ్లి వేడుకలకు, నేటి తరం పెళ్లిళ్లకు చాలా తేడా ఉంది. నేటి రోజుల్లో పెళ్లి వేడుకల విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తున్నారు. జీవితంలో ఒకేసారి చేసుకునే ఒక మధురమైన జ్ఞాపకం కావడంతో పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఆలోచిస్తున్నారు. అందులోనూ ఇటీవల కాలంలో వధూవరులు ఇద్దరు డాన్స్ చేస్తూ పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇవ్వడం ట్రెండ్ గా మారిపోయింది. ఇక ఇలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రాజస్థాన్‌లో ప్రత్యేకరమైన ఊరేగింపు జరిగింది. ఈ అపూర్వ ఊరేగింపుపై సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన ఒక వివాహ ఊరేగింపు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ వివాహ ఊరేగింపులో అన్ని ఆకట్టుకునే విశేషాలే కనిపించాయి. ఇక్కడ విషయం ఏంటంటే..51 ట్రాక్టర్లలో పెళ్లి ఊరేగింపు బయల్దేరింది. అందులో ఒకటివరుడు స్వయంగా నడుపుతూ వచ్చాడు. గూడమలాని గ్రామానికి చెందిన ప్రకాష్ చౌదరికి రోలి గ్రామానికి చెందిన మమతతో వివాహమైంది. సోమవారం ఉదయం వరుడి ఇంటికి 51 కిలోమీటర్ల దూరంలోని రోలి గ్రామానికి ఊరేగింపు బయలుదేరింది. 51 ట్రాక్టర్లలో 200 మందికి పైగా ఈ మహా ఊరేగింపులో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు క్యూలో ఉండడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వరుడు ప్రకాష్ చౌదరి మాట్లాడుతూ..తమది వ్యవసాయ కుటుంబమని, ఇంట్లో అందరూ వ్యవసాయం చేస్తారని చెప్పాడు. రైతు గుర్తింపు ట్రాక్టర్. మా నాన్నగారి ఊరేగింపు కూడా ట్రాక్టర్‌తోనే జరిగిందని, తన పెళ్లి ఊరేగింపును ట్రాక్టర్ల జరుపుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. అందుకే ఇలా వెరైటీగా 51 ట్రాక్టర్లతో ఊరేగింపు సాగుతోందని తెలిపారు.

వరుడి తండ్రి జేతారాం మాట్లాడుతూ..భూమి పుత్రుడికి ట్రాక్టరే హోదా కల్పిస్తుందని అన్నారు. మా నాన్న, తాతయ్యల పెళ్లి ఊరేగింపు ఒంటెలపై జరిగింది. మా కుటుంబంలో ఇప్పటికే 20-30 ట్రాక్టర్లు ఉన్నాయి. నా రైతు స్నేహితులు కలిసి మొత్తం 51 ట్రాక్టర్లతో ఊరేగింపుగా బయలుదేరారని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?