Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వింత శిశువు జననం.. 4 చేతులు, 4 కాళ్లు, 2 గుండెలతో పుట్టిన పసికందు.. చూసేందుకు బారులు తీరిన జనం..

ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం ఉందని, పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. వారిని త్వరలోనే ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఇక ఇలాంటి వింతశిశువు పుట్టిందనే వార్త విని సిబ్బంది, ఇతర రోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ చిన్నారిని చూసేందుకు ఆస్పత్రి ముందు జనం పోటెత్తారు.

వింత శిశువు జననం.. 4 చేతులు, 4 కాళ్లు, 2 గుండెలతో పుట్టిన పసికందు.. చూసేందుకు బారులు తీరిన జనం..
Born Baby
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 14, 2023 | 10:08 AM

బీహార్‌లోని ఛప్రాలో ఓ వింత శిశువు జన్మించింది. 4 చేతులు, 4 కాళ్లు, 2 గుండెలు, 1 తలతో పుట్టిన పసికందు వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సిజేరియన్ ద్వారా జన్మించిన ఆడ శిశువు పుట్టిన కొద్దిసేపటికే మరణించింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ఛప్రా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో ఓ వింత పాప పుట్టింది. ఈ అమ్మాయికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు, రెండు గుండెలు ఉన్నాయి. కానీ ఒక్క తల మాత్రమే ఉంది. ఇలాంటి వింత శిశువులు జన్మించటానికి గల కారణం ఏంటని వైద్యులు వివరించారు. నర్సింగ్ హోమ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. వైద్య పరిభాషలో ఇలాంటి పిల్లలను కంజాయిన్డ్ ట్విన్స్ (Conjoined twins)అంటారని చెప్పారు..

అవిభక్త కవలలు పుట్టడానికి కారణం ఏమిటి..?

మహిళ గర్భాశయంలో ఒకే అండం నుంచి ఇద్దరు పిల్లలు ఏర్పడితే కవలలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. దీని కారణంగా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని చెప్పారు.. అటువంటి పరిస్థితిలో సియామీ కవలలు ఇలా పుడతారు. దీంతో పాటు గర్భిణీలు కూడా ఇలాంటి బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.

నాలుగు చేతులతో పుట్టిన బిడ్డ కేవలం 20 నిమిషాలు మాత్రమే జీవించి, ఆ తరువాత మరణించింది. సిజేరియన్ ద్వారా పాప పుట్టిందని, కేవలం 20 నిమిషాలు మాత్రమే బతికిందని డాక్టర్ చెప్పారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లికి ఇది మొదటి సంతానం. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం ఉందని, పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. వారిని త్వరలోనే ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఇక ఇలాంటి వింతశిశువు పుట్టిందనే వార్త విని సిబ్బంది, ఇతర రోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ చిన్నారిని చూసేందుకు ఆస్పత్రి ముందు జనం పోటెత్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..