- Telugu News Photo Gallery Mountains 3 to 4 times higher than mount everest found deep inside earth Telugu News
ఎవరెస్ట్ కంటే 4 రెట్లు ఎత్తైన పర్వతం గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఎక్కడో తెలుసా..?
అత్యంత ఎత్తైన శిఖరాలు ఏంటంటే ఎవరెస్ట్, కే2 శిఖరాలని చాలా మంది చెబుతారు. కానీ ఎవరెస్ట్ కన్నా ఎత్తైన పర్వాతాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా..? మన భూమి లోపలే. అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకలు వీటిని గుర్తించారు. భూమిపైనే కాదు భూమి లోపల కూడ భారీ పర్వతాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
Updated on: Jun 14, 2023 | 8:52 AM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా ఎవరెస్ట్ పర్వతాన్ని చెబుతారు. ఇప్పుడు ఆ ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు 3 నుండి 4 రెట్లు ఎత్తులో ఉన్న పర్వతాలను భూమి కింద గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ పర్వతాలు అంటార్కిటికా ఖండం కింద సముద్రం అడుగున ఉన్నట్టుగా నిర్ధారించారు.

అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకలు వీటిని గుర్తించారు. భూమిపైనే కాదు భూమి లోపల కూడ భారీ పర్వతాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఎవరెస్ట్ ఎత్తు 8.8 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కానీ భూగర్భంలో ఉండే పర్వతాలు ఏకంగా 38 కిలోమీటర్ల వరుకు ఉన్నాయని తెలిపారు.

అయితే ఈ పర్వతాలు భూమికి 2900 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిని అల్ట్రా-లో వెలాసిటీ జోన్స్‌గా పిలుస్తున్నారు. అంటార్కిటికాలోని భూకంప అధ్యయన కేంద్రాల నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం బయటపడిందని పరిశోధకులు తెలిపారు. వీటి ఆధారంగానే ఈ ఎత్తైన పర్వతాలను గుర్తించినట్లు వెల్లడించారు.

అంటార్కిటికాలోని పర్వతాల ఉనికిని, వాటి ఎత్తును అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు హై-డెఫినిషన్ ఇమేజింగ్ పద్ధతిని ఉపయోగించారు. అక్కడ భూకంపాలకు సంబంధించిన వేలాది భూకంప రికార్డులను విశ్లేషించారని సమాచారం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ భారీ పర్వతాలు భూమి కోర్, ఎగువ క్రస్ట్ మధ్య దాదాపు 2,900 కి.మీ. లోతుగా ఉన్నాయి. భూమి మధ్యలో భారీ మొత్తంలో వేడి ఉంది.

భూమి లోపల సముద్రం గడ్డకట్టడం వల్ల లేదా టెక్టోనిక్ ప్లేట్లు భూమి లోపలికి కూలిపోవడం వల్ల ఈ పర్వతాలు ఏర్పడి ఉండవచ్చు. ఇక్కడ బసాల్ట్ శిలలు, గులకరాళ్లు అధికంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.




