Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మండువేస‌విలో ఒంటె దాహార్తిని తీర్చిన డ్రైవ‌ర్‌.. భావోద్వేగ వీడియో వైరల్

జూన్ 11న పోస్ట్ చేసిన ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు. అదే సమయంలో దీనికి 7 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఇది కాకుండా.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సమాజానికి అలాంటి దూత కావాలని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇలా పలువురు నెటిజన్లు ఆ డ్రైవర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

Watch: మండువేస‌విలో ఒంటె దాహార్తిని తీర్చిన డ్రైవ‌ర్‌.. భావోద్వేగ వీడియో వైరల్
Thirsty Camel
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 14, 2023 | 8:23 AM

మండే వేడిలో శరీరానికి నీరు చాలా అవసరం. నీళ్లు లేకపోతే గొంతు బాగా ఎండిపోతుంది. అది మనిషి అయినా, జంతువు అయినా సరే నీరు లేకుండా జీవించడం ఎవరికీ అంత సులభం కాదు. గతంలో సోషల్ మీడియాలో ఒక పిచ్చుక ఎండవేడిని తట్టుకోలేక సృహ తప్పిపోయినప్పుడు.. ఓ వ్యక్తి దానికి నీరందించి ప్రాణాలు కాపాడాడు. ప్రస్తుతం అలాంటిదే మరోక వీడియో కనిపించింది. IFS అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో భావోద్వేగ వీడియోను షేర్‌ చేశారు. వీడియోతో పాటు.. ఇందులో దాహంతో ఉన్న ఒంటె రోడ్డు పక్కన పడి ఉండటం కనిపించింది. ఆ జంతువును చూస్తే అది పూర్తిగా నిస్సహాయ స్థితిలో లేవలేకుండా పడిఉందని తెలుస్తోంది. ఇంతలో అదే మార్గంలో వెళ్తున్న ఓ వ్యక్తి చూపు ఆ ఒంటెపై పడింది. మండుతున్న ఎండలో, సృహ తప్పి పడిపోయిన ఒంటే.. దాహంతో బాధపడుతూ.. అది తన చివరి శ్వాసలను లెక్కిస్తోంది. అప్పుడు ఆ దయగల వ్యక్తి .. తన చేతులతో ఆ ఒంటెకు నీరందించి..ఆ జీవికి తిరిగి ప్రాణం పోశాడు.. ప్రస్తుతం తీవ్రమైన ఎండలతో, వేడిగాలుల కారణంగా జన జీవనం అవస్థలు పడుతోంది. మీరు అందించే కొన్ని నీటి చుక్కలు ఒకరి జీవితాన్ని కాపాడతాయని IFS అధికారి సుశాంత్‌ నందా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ భావోద్వేగ వీడియో చూసిన నెటిజన్లు సైతం ప్రతి ఒక్కరూ స్పందించారు.

వైరల్ క్లిప్‌లో, రోడ్డు పక్కన ఒంటె నిస్సహాయంగా పడి ఉన్నట్లు చూడవచ్చు. వీడియో చూస్తే.. ఆ ఒంటె పరిస్థితి మరీ విషమంగా ఉందని ఊహించవచ్చు. అప్పుడే మంచి మనసున్న వ్యక్తి కళ్లు జంతువుపై పడతాయి. పరిస్థితిని గ్రహించి, అతను ఆలస్యం చేయకుండా తన బాటిల్ ద్వారా ఒంటెకు నీరు అందించాడు. దీంతో ఆ ఒంటే శక్తి తిరిగి వస్తుంది. కొన్ని సెకన్లలో డ్రైవర్ ఒంటె ప్రాణాన్ని కాపాడినట్లుగా మనకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు డ్రైవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జూన్ 11న పోస్ట్ చేసిన ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు. అదే సమయంలో దీనికి 7 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఇది కాకుండా.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సమాజానికి అలాంటి దూత కావాలని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇలా పలువురు నెటిజన్లు ఆ డ్రైవర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి