CM Jagan: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదు: సీఎం జగన్‌ కీలక ఆదేశాలు..

విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించాలన్నారు. పాడేరు, పులివెందుల, ఆదోని కొత్త మెడికల్‌ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయన్నారు. మిగిలిన కాలేజీల్లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు అధికారులు.

CM Jagan: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదు: సీఎం జగన్‌ కీలక ఆదేశాలు..
CM Jagan
Follow us
Jyothi Gadda

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 13, 2023 | 9:02 PM

వైద్య, ఆరోగ్యశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు, పలువురు ఆయా విభాగాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక అదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఫిర్యాదు చేయడానికి ప్రతిచోటా ఫోన్ నంబర్ ఉండాలని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రిక్రూట్ మెంట్ వ్యవస్థ సమర్థవంతంగా పని చేయాలన్నారు. ఇక నాలుగు వారాలకు మించి.. ఎక్కడా కూడా సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు. ఒక ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ఆదేశించారు.

ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. క్యూ ఆర్‌ కోడ్‌ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్య వివరాలను ఇందులో నమోదు చేయాలని స్పష్టం చేశారు. అలాగే విలేజ్‌ క్లినిక్‌ స్ధాయిలో కంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలన్నారు.

ఈ విద్యాసంవత్సంలోనే ప్రారంభం కానున్న కొత్త మెడికల్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్షించారు. మెడికల్‌ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించాలన్నారు. పాడేరు, పులివెందుల, ఆదోని కొత్త మెడికల్‌ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయన్నారు. మిగిలిన కాలేజీల్లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..