Andhra Pradesh: ఆ రోజులు మారాయి..! తగ్గేదేలే అంటున్న వైసీపీ, బీజేపీ.. విజయసాయిరెడ్డి ఏమన్నారంటే..?
BJP Vs YSRCP Politics: ఏపీలో వైసీపీ, బీజేపీల మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరుకుంటోంది. వైసీపీకి బీజేపీ ఎప్పుడూ అండగా లేదని కమలనాథులు చెబుతుంటే.. బీజేపీ అగ్రనేతల విమర్శల వెనుక ఆ పార్టీలోని టీడీపీ కోవర్టుల పాత్ర ఉందని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
BJP Vs YSRCP Politics: ఏపీలో వైసీపీ, బీజేపీల మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరుకుంటోంది. వైసీపీకి బీజేపీ ఎప్పుడూ అండగా లేదని కమలనాథులు చెబుతుంటే.. బీజేపీ అగ్రనేతల విమర్శల వెనుక ఆ పార్టీలోని టీడీపీ కోవర్టుల పాత్ర ఉందని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. రెండు రోజులుగా ఏపీలో వైసీపీ నాయకులు బీజేపీపై గట్టిగానే గురిపెడుతున్నారు. వైసీపీలోని కీలక నాయకులు ఆచితూచి వ్యాఖ్యలు చేస్తుంటే.. మిగతా లీడర్స్ మాత్రం పదునైన కౌంటర్సే ఇస్తున్నారు. మీడియా చిట్‌చాట్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉందని.. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరుగా చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. పైగా అవినీతి ఎక్కడ జరిగిందో నడ్డా, అమిత్ షాలు చెప్పలేకపోయారన్నది వైసీపీ ఎంపీ వాదన. అవినీతి అని సాధారణ ఆరోపణలే చేశారని ముక్తాయించారు. టీడీపీ ట్రాప్‌లో బీజేపీ పడిందంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టులు ఇచ్చిన స్క్రిప్టే అమిత్ షా చదివారంటూ పలు విమర్శలు చేశారు.
వైసీపీకి బీజేపీ అండగా లేదు..
అయితే, బీజేపీ అండగా ఉండకపోవచ్చన్న సీఎం జగన్ కామెంట్స్‌పై ఎంపీ జీవీఎల్ నరసింహారావు రియాక్ట్ అయ్యారు. అసలు వైసీపీకి బీజేపీ ఎప్పుడు అండగా లేదంటూ స్పష్టంచేశారు.
బీజేపీ, వైసీపీల మధ్య రోజులు మారాయి..!
బీజేపీ, వైసీపీ మధ్య గ్యాప్ వచ్చాక రోజులు కూడా మారిపోయాయి. అది ఏ స్థాయిలో ఉందో.. కేంద్రమంత్రి పీయూష్‌గోయెల్ తిరుమల పర్యటన తేటతెల్లం చేసింది. పీయూష్‌గోయెల్ తిరుమల దర్శనానికి వస్తే వెంట టీటీడీ ప్రొటోకాల్ సిబ్బంది తప్ప ఇంకెవరూ ప్రముఖులు లేరు. అదే పీయూష్‌గోయెల్ 2021 మార్చి 13న కేంద్రమంత్రి హోదాలోనే తిరుమల వస్తే.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, నాటీ ఈవో జవహర్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వెంటే ఉన్నారు. ఆనాటి ఘటనలను గుర్తుచేసుకున్నవాళ్లు.. ఇంతలో ఎంత తేడా వచ్చింది అని చెవులు కొరుక్కుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..