Big News Big Debate: మైండ్‌గేమ్ ఎవరిది.. బ్లైండ్‌గా ఫిక్స్ అయిందెవరు..? ఏపీలో రచ్చ రచ్చ
Andhra Politics: సౌత్ నుంచి రుతుపవనాలు చల్లని కబురు తీసుకొస్తే.. నార్త్ నుంచి వచ్చిన బీజేపీ అగ్రనేతలు హాట్ హాట్ న్యూస్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏపీకి క్యూ కట్టిన బీజేపీ పెద్దలు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించగా..
Andhra Politics: సౌత్ నుంచి రుతుపవనాలు చల్లని కబురు తీసుకొస్తే.. నార్త్ నుంచి వచ్చిన బీజేపీ అగ్రనేతలు హాట్ హాట్ న్యూస్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏపీకి క్యూ కట్టిన బీజేపీ పెద్దలు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించగా.. అమిత్‌షా, నడ్డాలకు కౌంటర్ ఇస్తూ ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి. ఎవరికి అండగా ఉండాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ నేతలు చెబుతుంటే.. కోవర్టు రాజకీయాలతో టీడీపీ ట్రాప్‌లో బీజేపీ పడిందని విమర్శిస్తోంది వైసీపీ.
ఏపీ వ్యాప్తంగా రాజకీయ తుఫాను ఆవరించింది.. జేపీ నడ్డా, ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు YSRCPపై తీవ్ర ఆరోపణలు.. వాటికి సీఎం జగన్ కౌంటర్‌తో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. రాష్ట్రంలోని టీడీపీ, జనసేనపార్టీలను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన అధికారపార్టీ ఇప్పుడు బీజేపీ వైపు తన విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. >>>> SPOT
బీజేపీ అండగా ఉండకపోవచ్చన్న సీఎం జగన్ వ్యాఖ్యల చుట్టూనే ఇప్పుడు ఏపీ రాజకీయం తిరుగుతోంది. వైసీపీకి తాము ఏనాడు అండగా లేమని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ GVL నరసింహారావు. తామోదో సహకరించామన్నట్టుగా వైసీపీ తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తుందన్నారు.
అయితే బీజేపీ ఏపీలో టీడీపీ కోవర్టు రాజకీయాల్లో చిక్కుకుందని సంచలన ఆరోపణలు చేశారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. చంద్రబాబు కోవర్టు ఆపరేషన్‌లో భాగంగానే బీజేపీ నేతలు ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
ఏపీలో కోవర్టు రాజకీయాలు నిజమేనా? ఇంతకీ ఎవరు ఎవరి ట్రాపులో పడ్డారు? మరెవరు మైండ్‌గేమ్ ఆడుతున్నారు?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..