Comedian Saptagiri: రాజకీయాల్లోకి సప్తగిరి.. టీడీపీ నుంచి ఆఫర్ ఉంది.. వీడియో.

Comedian Saptagiri: రాజకీయాల్లోకి సప్తగిరి.. టీడీపీ నుంచి ఆఫర్ ఉంది.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Jun 13, 2023 | 9:11 AM

పొలిటికల్‌ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు సప్తగిరి. TDP నుంచి ఆఫర్‌ ఉందన్నారు. త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెప్తానన్నారు. చిత్తూరు జిల్లాలోని పార్లమెంట్‌ లేదంటే అసెంబ్లీకి పోటీకి సిద్ధంగా ఉన్నానన్నారు. తనది చిత్తూరు జిల్లానే అని.. పేదల కష్టాలు తెలుసని పేర్కొన్నారు.

పొలిటికల్‌ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు సప్తగిరి. TDP నుంచి ఆఫర్‌ ఉందన్నారు. త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెప్తానన్నారు. చిత్తూరు జిల్లాలోని పార్లమెంట్‌ లేదంటే అసెంబ్లీకి పోటీకి సిద్ధంగా ఉన్నానన్నారు.  తనది చిత్తూరు జిల్లానే అని.. పేదల కష్టాలు తెలుసని పేర్కొన్నారు. పాదయాత్రలో లోకేష్‌ను కూడా కలిశానన్నారు. చంద్రబాబు, లోకేష్ ఆదేశిస్తే పోటీకి సిద్ధమన్నారు సప్తగిరి. పేదలకు సర్వీస్ చేసేందుకు వచ్చే ఏ అవకాశాన్ని వదులకోనని చెప్పారు. తాను పోటీ చేయాలా వద్దా అనే విషయం పార్టీ పెద్దలు చూసుకుంటారని చెప్పారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించి అందరికీ తెలుసన్నారు.సినిమాల్లో నిజాయితీతో పని చేశానని.. అందుకే మంచి అవకాశాలు వచ్చాయన్నారు సప్తగిరి. రాజకియాల్లో కూడా అదే పోకడ కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలు మాత్రం వదలనన్నారు. తన సేవలు కావాలని టీడీపీ భావిస్తే.. రాష్ట్రమంతటా ప్రచారం చేస్తానన్నారు.  చిత్తూరు జిల్లాతో ఐరాలలో పుట్టాననని.. బంగారుపాళ్యం, పుంగనూరులో చదువకున్నట్లు సప్తగిరి తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!