ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కెమికల్‌ లోడ్‌ లారీ పేలుడు.. నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు..

ఎక్స్‌ప్రెస్‌వేలో రసాయనాలతో నిండిన ట్రక్కులో మంటలు చెలరేగి పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. హైవేపైనే లారీ పేలిపోవడంతో రోడ్డు పూర్తిగా జామ్ అయింది.

ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కెమికల్‌ లోడ్‌ లారీ పేలుడు.. నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు..
Oil Tanker Fire
Follow us

|

Updated on: Jun 13, 2023 | 6:57 PM

రసాయనాల లోడ్‌తో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలిపోయింది. దీంతో నలుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో రసాయనాలతో నిండిన ట్రక్కులో మంటలు చెలరేగి పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. హైవేపైనే లారీ పేలిపోవడంతో రోడ్డు పూర్తిగా జామ్ అయింది.

ముంబై నుంచి పూణెకు రసాయనాలతో కూడిన లారీ లోనావాలా, ఖండాలా సమీపంలో మంటలు చెలరేగాయి. కెమికల్ లారీకి మంటలు అంటుకున్న వెంటనే ఒక్కసారిగా అక్కడ దట్టమైన పొగతో కారుచీకటి కమ్మేసింది. లారీ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు తీవ్రతకు మరో మూడు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో ఎక్స్ ప్రెస్ హైవే పూర్తిగా జామ్ అయింది. వాహనాలు వేరే మార్గంలో వెళ్లేందుకు అనుమతించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.

ముగ్గురికి తీవ్రగాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని సూచించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఫడ్నవీస్ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల, అదే రహదారిపై బ్రేక్ ఫెయిల్యూర్‌తో ట్రక్కు సిరీస్‌లో 12 వాహనాలను ఢీకొట్టింది.  అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.. అయితే ఆరుగురికి మాత్రం గాయాలయ్యాయి. రాయగడ జిల్లాలోని ఖోపోలి సమీపంలో సుమారు 12 వాహనాలను ట్రక్కు ఢీకొట్టిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ సమయంలో ఏడెనిమిది కార్లు కూడా దెబ్బతిన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం