Resign Letter :రాజీనామా లేఖ.. ఇలా కూడా రాస్తారా..? అందుకే ఇంతలా వైరల్ అవుతోంది..

ఈ పోస్ట్‌కు రెండు లక్షల నాలుగు వేలకు పైగా లైక్‌లు, ఐదు వేల రీట్వీట్లు, వేల సంఖ్యలో కామెంట్స్‌ వచ్చాయి. ఈ రాజీనామాను చదివిన కొందరు యూజర్లు నవ్వు ఆపుకోలేక పోతుండగా.. ఇప్పుడు ఇలాగే రాజీనామా చేస్తామంటున్నారు ఇంకొందరు నెటిజన్లు. రిజైన్ లెటర్ భలే సింపుల్ గా రాశారు, కదా! సూపర్ అంటూ కొందరు ఈ లేఖ రాసిన ఉద్యోగిని పొగుడుతున్నారు.

Resign Letter :రాజీనామా లేఖ.. ఇలా కూడా రాస్తారా..? అందుకే ఇంతలా వైరల్ అవుతోంది..
Resign Letter
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 13, 2023 | 5:23 PM

రాజీనామా లేఖ(Resign Letter) రాయడం కూడా ఒక కళే… ఇందులో ప్రతి ఉద్యోగి మాస్టర్ కాదు. అయితే, కొంతమంది ఉద్యోగులు రాజీనామా లేఖలో తమ మనోవేదన, అభిప్రాయాలు, కారణాలు చెబుతూ..తమ ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ఒక ఉద్యోగి ఇచ్చిన రాజీనామా లేఖ సర్వత్రా ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అవును, సోషల్ మీడియాలో ‘మూడు పదాలు’ రాజీనామా లేఖ ఒకటి హల్‌చల్‌ చేస్తోంది. అయితే, ఈ రిజైన్‌ లెటర్‌ పాతదే అయినప్పటికీ నెట్టింట మరోమారు చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు బిందాస్ ఉద్యోగుల రాజీనామాలు ఇలాగే ఉంటాయని అంటున్నారు! ఈ లేఖలో ఉద్యోగి “బై, బై సర్” అని సింపుల్‌గా, సుత్తిలేకుండా తన రాజీనామా లేఖను ముగించాడు. అయితే, ఈ పోస్ట్‌ గతంలో కూడా సోషల్ మీడియాను ఆశ్చర్యపోయేలా చేసింది.

ఈ పోస్ట్‌ని ట్విట్టర్ యూజర్ @MBSVUDU పోస్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశమైంది..! ఇలాంటి వెరైటీ రాజీనామ లేఖను షేర్‌ చేస్తూ కస్టమర్‌ ‘సింపుల్’ అనే పదాన్ని మాత్రమే ఉపయోగించారు. ఈ లేఖ చదివిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇప్పటికే ఈ పోస్ట్‌కు రెండు లక్షల నాలుగు వేలకు పైగా లైక్‌లు, ఐదు వేల రీట్వీట్లు, వేల సంఖ్యలో కామెంట్స్‌ వచ్చాయి. ఈ రాజీనామాను చదివిన కొందరు యూజర్లు నవ్వు ఆపుకోలేక పోతుండగా.. ఇప్పుడు ఇలాగే రాజీనామా చేస్తామంటున్నారు ఇంకొందరు నెటిజన్లు. రిజైన్ లెటర్ భలే సింపుల్ గా రాశారు, కదా! సూపర్ అంటూ కొందరు ఈ లేఖ రాసిన ఉద్యోగిని పొగుడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఇంతకీ ఈ రాజీనామా లేఖలో ఏం చెప్పారంటే..సదరు ఉద్యోగి తన రాజీనామాకు ఎలాంటి కారణం చెప్పలేదు. కేవలం మూడు పదాలను మాత్రమే రాశాడు..అది కూడా.. ‘బై బై సర్..’. అవును, మీరు చదివింది నిజమే. రాజీనామా లేఖ ఫోటో పోస్ట్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో కనిపించిన వెంటనే చాలా మందిలో దుమారం సృష్టిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!