Viral: చాయ్‌ ఇలాక్కూడా తాగుతారా.? ఈ టీ స్టాల్ స్పెషాలిటీ తెలిస్తే మైండ్ బ్లాంక్..

క్రియేటివిటీలో ఇండియన్స్‌కు సాటి మరెవ్వరూ ఉండరు. కొత్త కొత్త ఆలోచనలతో తమ వ్యాపారాలను లాభాల బాట పట్టిస్తారు. కస్టమర్లకు భిన్నమైన వాతావరణాన్ని ఏర్పరచేందుకు..

Viral: చాయ్‌ ఇలాక్కూడా తాగుతారా.? ఈ టీ స్టాల్ స్పెషాలిటీ తెలిస్తే మైండ్ బ్లాంక్..
Tea Stall
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 13, 2023 | 4:51 PM

క్రియేటివిటీలో ఇండియన్స్‌కు సాటి మరెవ్వరూ ఉండరు. కొత్త కొత్త ఆలోచనలతో తమ వ్యాపారాలను లాభాల బాట పట్టిస్తారు. కస్టమర్లకు భిన్నమైన వాతావరణాన్ని ఏర్పరచేందుకు తమ స్టాల్స్‌ను సరికొత్త థీమ్స్‌తో తీర్చిదిద్దుతారు. సరిగ్గా ఇదే కోవలో అహ్మదాబాద్‌లోని ఓ టీ స్టాల్ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకమైన థీమ్‌ను ఎంచుకుంది. బహుశా.! అదేంటో తెలిస్తే.. మీరూ దడుసుకోవడం ఖాయం.. అదేంటంటే ఈ టీ స్టాల్ చనిపోయిన వ్యక్తుల మధ్య కస్టమర్లకు వేడి వేడి టీ అందిస్తుంది. స్థానిక లాల్ దర్వాజా దగ్గరున్న లక్కీ టీ స్టాల్ 72 సంవత్సరాల చరిత్ర కలిగింది. అప్పటి నుంచి ఈ టీ స్టాల్.. కస్టమర్లకు వేడి వేడి చాయ్‌ను శవపేటికల మధ్య సర్వ్ చేస్తోంది. తాజాగా ఓ ఫుడ్ బ్లాగర్ ఈ టీ స్టాల్‌ను సందర్శించగా.. ఆ స్టాల్ యజమాని దగ్గర నుంచి పలు ఆసక్తికర విషయాలను అడిగి తెలుసుకున్నాడు.

‘అహ్మదాబాద్‌లో ఇదొక స్మశానవాటిక అని తెలియకుండా.. షాప్ యజమాని కృష్ణన్ కుట్టి దీన్ని కొనుగోలు చేశాడు. అయితేనేం ఈ విషయం తెలిసినా కూడా.. అతడు తన ఆలోచనను మార్చుకోలేదు. సమాధుల చుట్టూ ఇనుప కడ్డీలను ఏర్పాటు చేయడమే కాకుండా, వాటి చుట్టూ, అందుబాటులో ఉన్న స్థలంలో సిట్టింగ్ ఏరియాస్‌ను నిర్మించాడు. ప్రతిరోజు ఉదయం, సిబ్బంది సమాధులన్నింటినీ శుభ్రపరుస్తారు. అలాగే వాటిని పూలతో అలంకరిస్తారు. మొదటిలో పెద్దగా కస్టమర్లు రాకపోయినప్పటికీ.. ఆ తర్వాత ఈ ప్లేస్ భలే రద్దీగా మారిపోయింది. అందరికీ ఫేవరెట్ స్పాట్ అయింది’ అని బ్లాగర్ చెప్పాడు. కాగా, ప్రఖ్యాత పెయింటర్ ఎం.ఎఫ్ హుస్సేన్ 1994లో ఈ టీ స్టాల్‌ను సందర్శించి.. యజమానికి తన పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చాడట. స్థానిక ప్రజలందరూ ఇదొక టీ స్టాల్‌గానే చూస్తారని, శవపేటికలను ఎవ్వరూ పట్టించుకోరని అక్కడ పని చేసే సిబ్బంది చెబుతున్నారు.