- Telugu News Lifestyle Food Best Time to to consume Chia seeds Water to get maximum benefits Telugu News
Health Tips: మధుమేహాలకు దివ్యౌషధం ఈ చిట్టి విత్తనాలు.. ఇలా వాడితే మీ కంట్రోల్‌కి షుగర్..!
చాలా మంది ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చియా విత్తనాలను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. కొందరు ఉదయం నిద్రలేవగానే చియా సీడ్స్ కలిపిన నీటిని తాగుతారు. మరికొందరు రాత్రి పడుకునే ముందు తాగుతారు. అయితే చియా సీడ్స్‌ను ఎప్పుడు తినాలో మీకు తెలుసా?
Updated on: Jun 13, 2023 | 3:09 PM

ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే విత్తనాల్లో చియా సీడ్స్ కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం అత్యధికంగా పెరిగింది. ఇక మధుమేహులకు చియా సీడ్స్ ఓ వరమనే చెప్పొచ్చు. షుగర్ కంట్రోల్ దగ్గర నుండి వెయిట్ లాస్ వరకు అనేక విధాలుగా చియా సీడ్స్ మధుమేహం భాదితులకు ఉపయోగపడతాయి. ఇంతకీ చియా సీడ్స్‌ను మధుమేహం ఉన్న వారు ఎలా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఒక గ్లాస్ తీసుకుని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వాటర్‌లో నానబెట్టుకున్న చియా సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, గ్లాస్ గోరు వెచ్చని వాటర్ వేసుకుని బాగా కలిపి సేవించాలి.

ప్రతి రోజూ ఉదయాన్నే చియా సీడ్స్‌ను ఈ విధంగా తీసుకుంటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. బాడీ డిటాక్స్ అవుతుంది. చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.

అలాగే మధుమేహం ఉన్నవారు తరచూ నీరసం సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే నీరసాన్ని తరిమి కొట్టడంలో చియా సీడ్స్ గొప్పగి సహాయపడతాయి. అందుకోసం బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్ ను రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి.

అలాగే ఒక కప్పు యాపిల్ ముక్కలు, ఒక కప్పు సోయా పాలు, రెండు టేబుల్ స్పూన్ల తేనె, వన్ టేబుల్ స్పూన్ రోల్డ్ ఓట్స్, హాఫ్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్, అర కప్పు వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే. టేస్టీ స్మూతీ రెడీ అవుతుంది.


ఇక మధుమేహం ఉన్న వారు చియా సీడ్స్‌ను సలాడ్స్‌లో కలిపి తీసుకోవచ్చు. గోధుమలతో కలిపి ఉడికించి తినవచ్చు. ఓట్ మీల్ లో కలుపుకుని తీసుకోవచ్చు.

ఇలా ఎలా తిన్నా ఆరోగ్యానికి చియా సీడ్స్ ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సూపర్‌గా సహాయపడతాయి.





























